యువ

ఊతమిస్తే.. ఉరుములే! ( యువశక్తి దేశానికి కొండంత అండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులు నవసమాజ నిర్మాతలంటూ ప్రబోధాత్మక గీతాలు ఎన్ని వచ్చినా..కొంత మంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులంటూ వారిలో నిద్రాణంగా ఉన్న ప్రతిభను తట్టి లేపేందుకు ప్రయత్నించినా..నేటి యువతే రేపటి భవిత అంటూ నాయకులు ఉత్తేజిత ప్రసంగాల జోరుతో హోరెత్తించినా..అది ఎంత వరకూ యువశక్తికి ఉద్దీపన అవుతోంది? ఎంత మేరకు వారిని జాతి నిర్మాణ బృహత్తర క్రతువుకు సన్నద్ధం చేస్తోందన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలి పోతోంది. ఎందుకంటే..నేటి సమాజంలో పేరుకుపోయిన అనిశ్చితి, భవిష్యత్ పట్ల అయోమయం నుంచి యువత పూర్తిగా బయట పడటం లేదు. చదువు పరమార్థం ఉద్యోగం లేదా వ్యాపారమేనన్న బలమైన భావన వారిలో నాటుకు పోయింది. మారుతున్న సామాజిక పరిస్థితులు వాటితో పాటు పెరిగిపోతున్న పోటీతత్వం యువతలో ద్వైదీభావానే్న పెంచుతున్నాయ. ఎటు వెళ్లాలో తెలియక..తెలిసినా ధైర్యంగా ముందడుగు వేయలేక సతమతమయ్యే పరిస్థితి అడుగడుతునా ఎదురవుతోంది.

నేటి భారత యువత ఒకరకమైన
సామాజిక జీవనానికి అలవాటైపోయింది.
అవకాశాలను అందిపుచ్చుకునేందుకు
తీరాలను దాటే చొరవ, ధైర్యం, అందుకు
అవసరమైన ఆర్థిక సంపత్తి అన్నవి
అరకొరగానే ఉన్నాయి. ఉన్నచోటే ఉద్యోగం అన్న పరిమితి నుంచి బయట పడినప్పటికీ
విదేశాల్లో లభించే అవకాశాలను నమ్మకంగా అందిపుచ్చుకో గలిగే సామర్థ్యం వారిలో మరింతగా బలపడాల్సి ఉంది. యువత
మానసికంగా పరిపక్వం కావాలంటే..
అందుకు పరిసరాల పరంగానే కాకుండా సామాజికంగా అన్ని అంశాలు కలిసి
రావాలి. అంటే..అన్నీ సమతూక రీతిలో
అందివచ్చినప్పుడే ఈ రకమైన భావన
వారిలో బలోపేతం అవుతుంది.

యువత అంటే కేవలం ఫ్యాషన్‌కే
పరిమితం కాదు. ఆధునిక సాంకేతిక పరికరాలను
వినియోగించడంలో ఆరితేరిన రకంగానే భావించడానికి వీల్లేదు. వారిలో నిబిడీకృతమైన ఉన్న ఆలోచనల్ని, మనోభావాల్ని తట్టి లేపాలి. వాటికి తగిన ఊతాన్ని అందించడం ద్వారా అన్ని కోణాల్లోనూ జాతి నవ నిర్మాణానికి పురోగాముల్ని చేయాలి. ఇందుకు కేవలం వ్యవస్థాగతమైన ఏర్పాట్లు ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్టుగా సామాజిక వాతావరణమూ శక్తివంతం కావాలి. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువ వనరులను ప్రోదిచేసుకున్న భారత్ వాటిని సద్వినియోగం చేసుకోగలిగితేనే..అంతర్జాతీయంగా
రాణించగలుగుతుంది.

సామాజిక మార్పుల దూతలుగా,ఆర్థిక, రాజకీయ చైతన్యానికి ప్రతీకలుగా భావించే యువత తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పరిరక్షించే విధంగా ముందుకు దూసుకు పోగలుగుతోందా? అందుకు తగ్గట్టుగా అన్ని విధాలుగా వారికి భిన్న రంగాల్లో అవకాశాలను అందించగలుగుతున్నామా అన్నదీ అంతుబట్టని అంశమే. నేటి పరిస్థితుల్లో ఉపాధే జీవనాధారం. ఇందుకు ప్రధాన హేతువు విద్య. ఎంతగా విద్యారంగంలో రాణిస్తే అంతగానూ అవకాశాలు లభిస్తాయన్నది వాస్తవమే అయి నా..అందుకు ప్రతికూలతలు, ప్రతిబంధకాలు ఎన్నో.. ఎనె్నన్నో..! పైగా నేటి భారత యువత ఒకరకమైన సామాజిక జీవనానికి అలవాటైపోయింది. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తీరాలను దాటే చొరవ, ధైర్యం, అందుకు అవసరమైన ఆర్థిక సంపత్తి అన్నవి అరకొరగానే ఉన్నాయి. ఉన్నచోటే ఉద్యోగం అన్న పరిమితి నుంచి బయట పడినప్పటికీ విదేశాల్లో లభించే అవకాశాలను నమ్మకంగా అందిపుచ్చుకో గలిగే సామర్థ్యం వారిలో మరింతగా బలపడాల్సి ఉంది. యువత మానసికంగా పరిపక్వం కావాలంటే..అందుకు పరిసరాల పరంగానే కాకుండా సామాజికంగా అన్ని అంశాలు కలిసి రావాలి. అంటే..అన్నీ సమతూక రీతిలో అందివచ్చినప్పుడే ఈ రకమైన భావన వారిలో బలోపేతం అవుతుంది. ఎందుకంటే వీరిలో సామాజికమైన ఎన్నో అంశాల ప్రభావం చాలా బలంగానే ఉంటుంది. ధనిక పేద వ్యత్యాసం, పట్టణ-నగరాల మధ్య ఉన్న తేడాలు, కులం, వర్గం ఇలా ఒకటేమిటి వారిని మానసికంగా, సామాజికంగా కూడా ఎంతగానో ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. అన్ని విధాలుగా ఆరితేరితే తప్ప మిగతావారి కంటే ముందుకు దూసుకు పోగలిగే సామర్థ్యం యువతలో పెంపొందే అవకాశం ఉండదు. మిగతా దేశాలతో పోలిస్తే అన్ని విధాలుగా అవకాశాలను అందిపుచ్చుకునే..దేశాభివృద్ధికి విశేషమైన రీతిలో దోహదం చేయగలిగే యువశక్తి భారత్‌కే ఉంది. ఇదే విషయాన్ని తన విదేశీ పర్యటనలన్నింటిలోనే ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెప్పడమే ఇందుకు నిదర్శనం. యువత అంటే కేవలం ఫ్యాషన్‌కే పరిమితం కాదు. ఆధునిక
సాంకేతిక పరికరాలను వినియోగించడంలో ఆరితేరిన రకంగానే భావించడానికి వీల్లేదు. వారిలో నిబిడీకృతమైన ఉన్న ఆలోచనల్ని, మనోభావాల్ని తట్టి లేపాలి. వాటికి తగిన ఊతాన్ని అందించడం ద్వారా అన్ని కోణాల్లోనూ జాతి నవ నిర్మాణానికి పురోగాముల్ని చేయాలి. ఇందుకు కేవలం వ్యవస్థాగతమైన ఏర్పాట్లు ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్టుగా సామాజిక వాతావరణమూ శక్తివంతం కావాలి. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువ వనరులను ప్రోదిచేసుకున్న భారత్ వాటిని సద్వినియోగం చేసుకోగలిగితేనే..అంతర్జాతీయంగా రాణించగలుగుతుంది. ఎక్కడికో పోయి అవకాశాల్ని వెతుక్కునే పరిస్థితుల్ని తొలగించి దేశీయంగానే ఉన్నతమైన, విస్తృతమైన అవకాశాల్ని కల్పించాలి. మన దేశం. మన సంపద. మన అభివృద్ధి అన్న బలమైన భావనను వారిలో పాదుగొల్పినప్పుడే మన యువశక్తి మనకు ఉపయోగ పడుతుంది. పట్టణ, నగర, గ్రామీణ యువత అన్న తేడా లేకుండా ఎక్కడున్న యువశక్తికి తిరుగుండదన్న నమ్మకమూ కలుగుతుంది. ఇందుకు కావాల్సింది ఉపన్యాసాల ఊతం కాదు..చేతల్లో అందించే సాయం. అది ఏదైనా యువతకు మేలు చేయాలి. సమాజానికి, దేశానికి అన్ని విధాలుగా ప్రబల శక్తిగా మారేలా దోహదం చేయాలి. ఇందుకు ప్రస్తుతం విస్తరిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మించిన తరుణం లేదు. ఇందుకు కావాల్సిందల్లా వారి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అద్దం పట్టే రీతిలో సామాజిక వాతావరణాన్ని తీర్చిదిద్దాలి. తద్వారా దేశ భవితను, యువ శక్తినీ తీర్చిదిద్దుకోవాలి.

-బి.సుధ