యువ

పంటికి బ్రష్ మంచిదేగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Oral -B toothbrush
మనం వాడే టూత్‌బ్రష్ హై టెక్ పోకడలు పోవడం 1954లోనే మొదలైంది. అప్పట్లో వచ్చిన ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ ఓ సంచలనం. తాజాగా ఓరల్-బి మరో అడుగు ముందుకేసి, టూత్‌బ్రష్‌కు బ్లూటూత్ సదుపాయాన్ని జోడించింది. ఈ బ్రష్ మనం పళ్లు తోమే విధానాన్ని ఓ కంట కనిపెట్టి, తగిన సూచనలు, సలహాలూ ఇస్తుందన్నమాట. మరీ గట్టిగా బ్రష్ చేస్తున్నా లేక ఎక్కువసేపు చేస్తున్నా కూడా వార్నింగ్ ఇస్తుంది.

టైట్ చేస్తుంది!
Emiota Belty
ఫిట్‌నెస్‌కు సంబంధించిన గాడ్జెట్లు చాలా నే అందుబాట్లో ఉన్నాయి. కానీ ఎమియోటా బెల్టీ తీరే వేరు. ఇదో స్మార్ట్ బెల్ట్. పారిస్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ఎమియోటా దీనిని డిజైన్ చేసింది. ఈ బెల్ట్ పెట్టుకుంటే, కూర్చున్నప్పుడు లేదా నిల్చున్నప్పుడు దానంతట అదే లూజ్ అవడం లేదా టైట్ కావడం జరుగుతుంది. పైగా మనకు కాస్త పొట్ట పెరుగుతోందనిపిస్తే, ఈ స్మార్ట్ బెల్ట్ స్మార్ట్ఫోన్‌కి హెచ్చరికలు పంపిస్తుంది కూడా.