యువ

వావ్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమెన్ ఆన్ వెబ్ (Women on Web)
సంక్షిప్త నామం ‘వావ్’ (WoW)
ఇదో స్వచ్ఛంద సంస్థ. దీని గురించి వింటే మీరు తప్పకుండా వావ్ అనాల్సిందే. మహిళల అభిమానాన్ని, ప్రభుత్వాల ఛీత్కారాలనూ మూటగట్టుకుంటూ, నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరగక పోరాడుతోంది ఉమెన్ ఆన్ వెబ్.
మహిళా హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఉన్నాయి. గృహహింస బారినుంచి మహిళలను కాపాడేందుకు కొన్ని, వరకట్న వేధింపులనుంచి ఉపశమనం కలిగించేందుకు మరికొన్ని, కార్యాలయాల్లో లైంగిక వేధింపులనుంచి రక్షించేందుకు ఇంకొన్ని, అత్యాచారాలను దునుమాడేవి మరికొన్ని...ఇలా ప్రపంచవ్యాప్తంగా మహిళలకోసం పాటుపడే ఎన్జీవోలు ఎన్నో ఉన్నాయి. కానీ...ఉమెన్ ఆన్ వెబ్ తీరు వేరు. అది ఎంచుకున్న కానె్సప్ట్ వేరు.
మహిళలు తమకు ఇష్టం లేకపోతే గర్భ విచ్ఛిత్తి (అబార్షన్) చేయించుకునే హక్కు అనేక దేశాల్లో ఉంది. కానీ, దాదాపు 49 దేశాల్లో మాత్రం అబార్షన్ నిషిద్ధం. ప్రాణం మీదకు వచ్చిన సందర్భాల్లోనే ఆయా దేశాల్లో అబార్షన్‌కు అనుమతిస్తారు. అలాంటి దేశాల్లో అబార్షన్ చేయించుకునేందుకు మహిళలు పడరాని పాట్లు పడుతుంటారు. చట్టం కళ్లుగప్పి అబార్షన్ చేయించుకునే క్రమంలో నాటువైద్యాన్ని ఆశ్రయించి, ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారూ లేకపోలేదు. దేశమేదైనా, గర్భవిచ్ఛిత్తి అనేది మహిళల సొంత విషయమని, చేయించుకోవాలో వద్దో తేల్చుకోవలసింది వారే గానీ ప్రభుత్వాలు కాదనీ గాఢంగా నమ్ముతున్న ఉమెన్ ఆన్ వెబ్, అబార్షన్ కోరుకునే మహిళలకు అండగా నిలిచేందుకు కంకణం కట్టుకుంది. అలా 2001లో ఉమెన్ ఆన్ వేవ్స్ ఏర్పాటైంది. తర్వాత దీని పేరును ఉమెన్ ఆన్ వెబ్‌గా మార్చారు. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు రెబెక్కా గోంపెర్ట్స్. వృత్తిరీత్యా డాక్టరయిన రెబెక్కా టెక్నాలజీకి తన ఆలోచనలు జోడించి, మహిళల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు పడుతున్న తపన చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
రెబెక్కా తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ముందు చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అంతర్జాతీయ న్యాయాన్ని ఔపోసన పట్టారు. ఆ తర్వాతే కార్యరంగంలోకి దిగారు. అబార్షన్‌కు ఉపకరించే రెండు ముఖ్యమైన మందులు- జచిళఔజఒఆ్యశళ, జఒ్యఔ్యఒఆ్యలను ఆమె ఎంచుకున్నారు. వీటితోపాటు అబార్షన్ చేసేందుకు కావలసిన ఇతర పరికరాలను, వైద్యులను తీసుకుని నౌకల్లో బయల్దేరుతుందామె. దేశాల మధ్యలోని అంతర్జాతీయ జలాల్లో నౌకలను ఆపి, అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్న మహిళల్ని ఆహ్వానించి, వారికి అబార్షన్ చేసి పంపిస్తారు. ‘అంతర్జాతీయ జలాలకు స్థానిక చట్టాలు వర్తించవు. అందుకే ఈ పద్ధతిని ఎంచుకున్నాం’అని చెబుతారు రెబెక్కా. అయితే ఈ క్రమంలో ఆమె ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నారు. ఆయా ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో ఆమె ప్రయత్నాలను వమ్ము చేశాయి. నౌకలను సీజ్ చేసిన ఉదంతాలూ లేకపోలేదు. అయినా రెబెక్కా ఆశయం ముందు ఈ ఆటుపోట్లన్నీ ఆవగింజలే అయ్యాయి. తాజాగా ఆమె డ్రోన్ల సాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ఎక్కడైతే అబార్షన్ చట్టవిరుద్ధమో ఆయా దేశాల్లో డ్రోన్ల ద్వారా అబార్షన్ పిల్స్‌ను వెదజల్లే ప్రక్రియకు ‘ఉమెన్ ఆన్ వెబ్’ శ్రీకారం చుట్టింది. ఇలా తొలిసారిగా పోలెండ్‌లో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా అమలు చేశారు. పోలెండ్‌లోనూ అబార్షన్ చట్టవిరుద్ధమే మరి. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌నుంచి డ్రోన్లు బయల్దేరి పోలెండ్‌లోని స్లబైస్ అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ అబార్షన్ పిల్స్‌ను వెదజల్లి వచ్చాయి. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టేందుకు ఇంతగా శ్రమిస్తున్న రెబెక్కాను, ఆమె ఏర్పాటు చేసిన ‘ఉమెన్ ఆన్ వేవ్స్’ను అభినందించాల్సిందే కదా!