యువ

టీ షర్టా... మజాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండమన్నారు. ఉంటాం సరే...మరి భాష సంగతేంటి? అక్కడి భాష మనకు రాకపోతే వేగడం ఎలా? ఇంగ్లీషు అధికార భాషగా లేని దేశాలకు వెళ్లినవాళ్లకు ఇలాంటి చిక్కులు ఎదురయ్యే ఉంటాయి. ఆ మధ్య ముగ్గురు స్నేహితులు ఇలాగే వియత్నాం వెళ్లారట. అక్కడి వారికి వీరి భాష తెలీదు. వీరికి ఆ భాష రాదు. హోటల్‌కు వెళ్లాలన్నా, రెస్ట్‌రూముల సమాచారం తెలుసుకోవాలన్నా...ఇలా ఒకటేమిటి అన్నీ సమస్యగా మారాయట. దీంతో ఆ ముగ్గురూ కలసి ఓ వినూత్నమైన టీ షర్ట్‌కు రూపకల్పన చేశారు. ఈ టీ షర్ట్ మీద 40 వరకూ సింబల్స్‌ను ప్రింట్ చేశారు. హోటళ్లు, ఆహారం, ఎయిర్‌పోర్ట్, హాస్పిటల్స్, వైఫై, టెలిఫోన్...ఇలా రకరకాల అవసరాలను సూచించే సింబల్స్ అన్నమాట. ఈ షర్ట్ ధరించి, ఎవరి దగ్గరకైనా వెళ్లి, విమానం సింబల్ చూపిస్తే, అవతలివ్యక్తికి మనం ఎయిర్‌పోర్ట్ గురించి అడుగుతున్నామని తెలుస్తుంది కదా. అదన్నమాట సంగతి. ఇంతకీ ఈ టీ షర్ట్ పేరు చెప్పలేదు కదూ...ఐకాన్ స్పీక్ టీ షర్ట్స్! దీని ధర 33 డాలర్లు.