యువ

గ్రీన్ ‘కబాడీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవాళి పచ్చగా పదికాలాలపాటు ఉండాలంటే...
పచ్చటి మొక్కలూ ఉండాలి.
అవి ఉంటేనే మనిషి మనుగడ.
చెట్లు లేకపోతే...?
కాలుష్య భూతం కోరలు సాచి
మానవాళిని కబళిస్తుంది.
ఇన్ని తెలిసినా, చెట్టును ఎవరూ
బతకనివ్వడం లేదు.
కలపకోసం, భారీ నిర్మాణాలకోసం,
సాగుకోసం...ఇలా ఒకటేమిటి రకరకాల కారణాలతో
చెట్లను పొట్టనబెట్టుకుంటున్నారు.
చివరకు కాగితం తయారీకి కూడా
చెట్లనే నరుకుతున్నారు.
ఈ దారుణాలన్నీ తెలిసినా ఒక్క నిట్టూర్పుతో
సరిపెట్టేవారే ఎక్కువ.
జనాన్ని జగృతం చేసి, మొక్కల పెంపకంపైనా,
చెట్ల ఆవశ్యకతపైనా అవగాహన పెంచాలనుకునేవారు
తక్కువమందే.
అలాంటి తక్కువమంది కోవకే చెందుతారు-కపిల్ బజాజ్, సందీప్ సేథీ!
ఇండియాలో లక్షల టన్నుల పేపర్ ఉత్పత్తి అవుతోంది. ఇందుకోసం వేలాది చెట్లను నరికేస్తున్నారు. వేస్ట్ పేపర్‌ను రీసైకిల్ చేయడం ద్వారా కాగితం తయారీకి చెట్ల వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు. కానీ...ఇండియాలో 20 శాతం మాత్రమే వేస్ట్ పేపర్ రీసైకిల్ అవుతోంది. మిగతా 80 శాతం ప్యాకింగ్‌లకూ, సెంట్రింగ్ పనులకూ...ఇలా ఇతరత్రా పనులకు వినియోగిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి వేస్ట్ పేపర్ సేకరించే రద్దీ వ్యాపారులు (హిందీలో వీరినే కబాడీవాలాలు అంటారు) రీసైక్లింగ్‌కు కాకుండా కాగితాన్ని ఇతరత్రా వినియోగించేవారికే అమ్ముతున్నారు. దాంతో ‘వృక్ష హననం’ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. సరిగ్గా ఈ పాయింటే కపిల్ బజాజ్, సందీప్ సేథీలను ఆలోచనలో పడేసింది. వేస్ట్ పేపర్‌ను పూర్తిస్థాయిలో రీసైక్లింగ్‌కు వినియోగిస్తే, చెట్లను తద్వారా పర్యావరణాన్ని కాపాడినవారమవుతామనే ఆలోచనతో వారు రంగంలోకి దిగారు. ‘కబాడీ ఎక్స్‌ప్రెస్’ పేరిట ఓ వైబ్‌సైట్ ఓపెన్ చేశారు. మార్కెట్‌ను సర్వే చేశారు. ఇండియాలో ఏడాదికి సగటున ప్రతి ఇంటిపై దాదాపు100 కేజీల పేపర్ వృథా అవుతోందని తెలుసుకున్నారు. దీనిపై ప్రజలను జాగరూకుల్ని చేయడం ద్వారా వేస్ట్ పేపర్‌ను నూటికి నూరు శాతం రీసైక్లింగ్‌కు తరలించేందుకు తమ వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.
తూర్పు ఢిల్లీలో నివాసముంటున్న కపిల్, సందీప్ తమ పరిసరాల్లో నివసించే ప్రజల్నే ముందుగా చైతన్యవంతుల్ని చేయాలనుకున్నారు. ఇళ్ల కాలనీలను ఎంచుకుని, కాలనీ కార్యవర్గాలతో ముందుగా మాట్లాడేవారు. తరవాత కాలనీలోని ప్రతి ఫ్లాట్‌కూ వెళ్లి ఇంటి యజమానికి ఓ బ్యాగ్ ఉచితంగా అందించడం మొదలుపెట్టారు. ఆ బ్యాగ్‌లో 15 కేజీల వేస్ట్ పేపర్ పడుతుంది. బ్యాగ్ నిండగానే తమకు కబురు పెట్టమని చెప్పి, ఫోన్ నంబర్ ఇచ్చారు. అలా ఎవరైతే వేస్ట్ పేపర్ ఇచ్చారో, వారికి మార్కెట్ ధర (కేజీ రూ.10) చొప్పునే చెల్లించేవారు. దీంతో వేస్ట్ పేపర్‌ను చిల్లర రద్దీ వ్యాపారులకు అమ్మే బదులు ఓ సామాజిక ప్రయోజనం కోసం ‘కబాడీ ఎక్స్‌ప్రెస్’కే అమ్మితే పోలా అనే ఆలోచన ప్రజల్లో పెరిగింది. ఇలా సేకరించిన వేస్ట్ పేపర్‌ను కపిల్, సందీప్ ద్వయం రీసైక్లింగ్ యూనిట్లకు కేజీ 13.50 పైసల చొప్పున విక్రయించేవారు. అయితే తమ ప్రధాన ఆదాయం ఇది కాదంటాడు కపిల్. ఇంటింటికీ ఇచ్చే బ్యాగ్‌లపై అడ్వర్టయిజ్‌మెంట్లు ముద్రిస్తామని, అదే తమ ప్రధాన ఆదాయ వనరు అని కపిల్ చెబుతాడు. గత నాలుగు నెలల్లో తమకు 2000మంది కస్టమర్లు ఏర్పడ్డారని, ఇప్పుడు తమ కార్యకలాపాలను ఘజియాబాద్‌కు కూడా విస్తరించనున్నామని చెప్పాడతను.
‘ఇంత ప్రయాస ఎందుకు? రద్దీవాలాలనుంచే వేస్ట్ పేపర్‌ను కొనుగోలు చేయవచ్చుగా?’ అన్న ప్రశ్నకు అది అంత ఈజీ కాదంటాడు సందీప్. మొదట్లో రద్దీవాలాల సహకారం అర్థించామని, డబ్బు కూడా ఎక్కువే ఇస్తామని ఆశ చూపామని, అయినా వారు తమతో చేయి కలపడానికి నిరాకరించారని అతను చెప్పాడు. దీనికి కారణం తూకంలోనూ, ధర నిర్ణయంలోనూ తామూ పారదర్శకతను పాటిస్తామని, అది రద్దీవాలాలకు నచ్చలేదని అంటాడు.
ప్రస్తుతం వినియోగదారులనుంచి వస్తున్న స్పందన తమకు ఉత్సాహం కలగజేస్తోందనీ, ఒక సామాజిక ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో చేస్తున్న తమ కృషికి అంతటా ప్రశంసల వర్షం కురుస్తోందని చెబుతున్నారు కపిల్, సందీప్.

chitram ..కపిల్ బజాజ్, సందీప్ సేథీ