యువ

బిలియన్ ఖాతాలో మెసెంజర్ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను నెలవారీ ప్రాతిపదికగా ఉపయోగిస్తున్న వారి సంఖ్య వంద కోట్లకు చేరిందట! ఫేస్‌బుక్‌కే చెందిన వాట్సాప్ వినియోగదారులు కూడా ఇప్పటికే వంద కోట్లకు మించారన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ చీఫ్ డేవిడ్ మార్కస్ స్పందిస్తూ.. ప్రజలను అనుసంధానిస్తూ, వారి మధ్య స్నేహ సంబంధాలను, వ్యాపార అవకాశాలనూ పెంపొందించేందుకు మెసెంజర్ యాప్ తోడ్పడుతోందన్నారు. మరో వంద కోట్ల మందిని ఆకట్టుకునేందుకు తమ ప్రయత్నం ఇప్పుడే ప్రారంభమైందని చమత్కరించారు. 2014లో ప్రారంభమైన మెసెంజర్ యాప్, రెండేళ్లలో అనూహ్యమైన రీతిలో వినియోగదారులను ఆకట్టుకోవడం విశేషమే. ఈ ఏడాది మెసెంజర్ యాప్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందనీ, ప్రతి మూడు నెలలకూ పది కోట్ల చొప్పున ఈ సంఖ్య పెరుగుతూ వచ్చిందన్నది ఫేస్‌బుక్ అంచనా.