యువ

తెలివైన నిఘా పరికరం క్లెవర్ లూప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెక్యూరిటీపరంగా టెక్నాలజీ అందిస్తున్న సాయం అంతాఇంతా కాదు. సిసి కెమెరాలు వచ్చాక, నిఘా అనేది సునాయాసమైపోయింది. అయితే ఇళ్లలోనూ, చిన్న చిన్న వ్యాపార సంస్థల్లోనూ వీటి వాడకం కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. క్లెవర్ లూప్‌ను అమర్చుకుంటే ఖర్చు తక్కువ..పనితనం ఎక్కువ. ఇదో స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్. ఇళ్లలోనూ, వ్యాపార సంస్థల్లోనూ, అద్దె ఇళ్ళల్లోనూ కూడా క్లెవర్ లూప్‌ను అమర్చుకోవచ్చు. ఇందులో మూడు ఇండోర్, అవుట్‌డోర్ హెచ్‌డి కెమెరాలు ఉంటాయి.
ఇవి బేస్ స్టేషన్‌తో కనెక్ట్ అయి నిరంతరం పనిచేస్తాయి. దీనిని ఐఓఎస్ లేదా ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు అనుసంధానించుకోవచ్చు. కెమెరా ఫుటేజ్‌ను అనలైజ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.
ముఖ్యమైన అలెర్ట్ ఫుటేజ్‌ను ఎస్‌డి కార్డ్‌లో నిక్షిప్తం చేసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు ఫుటేజ్‌ని ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్‌లో భద్రపరచుకోవచ్చు. నైట్ విజన్, టూ-వే ఆడియో సౌకర్యం వంటి ఫీచర్లు అదనం. క్లెవర్ లూప్ ధర 279 డాలర్లు.