యువ

కీపిటప్...తాన్యా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్సార్ యూనివర్శిటీ స్నాతకోత్సవం జరుగుతోంది...
పతకాల ప్రదానం మొదలైంది.
‘క్రిమినల్ లా’లో గోల్డ్ మెడల్ విజేత తాన్యా చౌదరి
అనౌన్స్‌మెంట్ వినగానే హాల్ చప్పట్లతో మార్మోగింది.
‘కాన్‌స్టిట్యూషనల్ లా’లో గోల్డ్ మెడల్ విజేత తాన్యా చౌదరి
మళ్లీ చప్పట్లు
అలా వరుసగా ఒకదానివెంట ఒకటిగా 17 పతకాలు అందుకుందామె. అన్నీ గోల్డ్ మెడల్సే!
ఇంతకీ ఎవరీ తాన్యా?
ఢిల్లీకి చెందిన తాన్యా చౌదరి నల్సార్ వర్శిటీలో న్యాయవిద్య అభ్యసించింది. అది ఆమె తండ్రి కోర్కె. కుమార్తెను పెద్ద న్యాయవాదిగా చూడలనుకున్న ఆయన తాన్యాను ఆ దిశగా ప్రోత్సహించారు. ఇంటర్‌మీడియట్ తర్వాత తాన్యా డైలమాలో పడింది. అంతా ఇంజనీరింగ్ చదువుతుంటే, తాను ‘లా’ చదవాలా? అని తనకు తానే ప్రశ్నించుకుంది. అందుకు సమాధానం ఆమెకు వెంటనే దొరికింది. సైన్స్ అంటే తనకు ఎలాగూ ఇష్టం లేదు. ఇక ‘లా’, సిఎ మిగిలాయి. రెండింటిలోనూ ‘లా’యే బెటర్. ఎందుకంటే- ‘లా’ చదివితే తండ్రి కోరిక కూడా నెరవేర్చవచ్చు. అందుకే వెంటనే నల్సార్‌లో చేరింది. అనుకున్నది సాధించింది. వరసగా 17 గోల్డ్ మెడల్స్ సాధించి, అందరిచేతా సెహభాష్ అనిపించుకుంది. అయితే కుమార్తె విజయాలను ఆస్వాదించేందుకు ఆమె తండ్రి మాత్రం లేరు. ఆయన గత ఏడాదే కన్నుమూశారు.
అది తనకు తీరని నష్టమంటుంది తాన్యా. తనను ఇంతగా ప్రోత్సహించిన తండ్రి బతికుంటే తన విజయాలకు పొంగిపోయేవారని కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుండగా చెబుతుందామె. తన విజయాలగురించి మాట్లాడుతూ ఏవో కొన్నింటిలో టాప్ ర్యాంక్ వస్తుందని తెలుసు కానీ, మరీ 17 మెడల్స్ వస్తాయని ఊహించలేదంటుంది. మరీ ముఖ్యంగా ‘బెస్ట్ అవుట్‌గోయింగ్ ఫిమేల్ స్టూడెంట్’కిచ్చే వైస్ చాన్సలర్ మెడల్ తనకు వస్తుందన్నది ఊహించలేదనీ, ఆ పతకం రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అంటుంది. ‘ఎంత బాగా చదివితే మాత్రం మరీ ఇన్ని పతకాలా?’ అని అడగితే ఏదైనా ఇష్టంతో చదివితే కష్టం కాదంటుందామె. ‘ఏ సబ్జెక్టూ భారంగా నేను భావించలేదు. ఆడుతూ పాడుతూ చదివేసేనంతే’ అని చెప్పే తాన్యా ప్రస్తుతం ఢిల్లీలోని ఓ న్యాయవాద సంస్థలో పనిచేస్తోంది. భవిష్యత్తులో మంచి లాయర్‌గా స్థిరపడాలన్నదే తన ఆశయమని చెప్పే తాన్యాకు యువ ‘బెస్ట్ విషెస్’ చెబుతోంది.!