యువ

గురి కలవాడే మొనగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ఉద్యోగానికి వెళ్లినా..‘నీ ఎక్స్‌పీరియన్స్ ఎంత..’అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికీ ఎదురయ్యేదే! అనుభవం అన్నది ఓ పని చేయడానికి ఎవరైనా అవకాశం ఇస్తేనే వస్తుంది. పుట్టుకతోనే లేదా డిగ్రీ చేతికొచ్చిన మరుక్షణం నుంచి ఏ వృత్తి లేదా ఉద్యోగంలో ఎవరికీ అనుభవం ఉండదు. మరి ఇలాంటి అనుభవాన్ని ఎలా సంపాదించాలి? ఏ పనినైనా ధైర్యంగా, ధీమగా, నమ్మకంగా చేయాలంటే ఏమి చేయాలి? ఈ రకమైన ప్రశ్నలు వేధించని వ్యక్తి ఉండడు. ఓ ప్రయత్నం విఫలమైతే అది నైరాస్యానికి దారితీస్తుంది. పదేపదే ఇలాంటి వైఫల్యాలే ఎదురైతే..సదరు వ్యక్తి ఆత్మ విశ్వాసానికే గండి పడుతుంది. వైఫల్యాలకు చలించకుండా, పరాజయాలనే విజయ సోపానాలుగా మార్చుకునే మార్గాలు లేక పోలేదు. ఇందుకు పురాణాల్లోనూ, చరిత్రలోనూ కోకొల్లలుగా ఉదాహరణలున్నాయి. ఏ గురువు దగ్గరా శిక్షణ తీసుకోకుండా ఆ గురువు బొమ్మనే పెట్టుకుని సవ్యసాచి అర్జునుడికి దీటుగా ఎదిగిన ఏకలవ్యుడికి ఉన్న అనుభవం ఏమిటి? తాను ఎంచుకున్న రంగంలో అత్యున్నత ప్రావీణ్యాన్ని సంపాదించాలన్న పట్టుదలే అతడ్ని తిరుగులేని విలుకాడ్ని చేసింది. ఇలాంటి వాళ్లెందరో చరిత్రలో ఉన్నారు...వర్తమాన గతిలోనూ తారసిల్లుతున్నారు. అందరికీ అన్ని రకాలుగా..అన్ని రంగాల్లోనూ రాణించే నేర్పు, ఓర్పు, పట్టుదల ఉండవు. అయితే తాము ఎంచుకున్న రంగాల్లో ఉన్నత స్థాయికి రాణించాలంటే..అందుకు ప్రధానంగా కావాల్సింది మీ బలాబలాల పట్ల లోతైన అవగాహన! అందరూ అన్ని పనులూ చేయలేరు. ఒక వేళ చేయాలనుకున్నా అది నేల విడిచి సాముచేయడం చందంగానే ఉంటుంది.
అందుకే మన సామర్థ్యం ఏమిటి.?అది ఎంచుకున్న రంగంలో రాణించేందుకు ఎంత వరకూ దోహదం చేస్తుంది? అన్నింటికీ మించి ఇదే రంగంలో రాణిస్తున్న వారితో పోటీపడి దూసుకుపోగలిగే ప్రతిభాపాటవాలు ఉన్నాయా? అన్న వౌలిక అంశాలపై లోతైన అవగాహన ఉంటే..మన నైపుణ్యానికి పదును పెట్టుకునే మార్గాలు కరతలామలకం అవుతాయి. స్వయం ప్రతిభతో..పట్టుదలతో రాణించే వ్యక్తులకు నైపుణ్యానికి పదును పెట్టుకునే క్రమంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలే అనుభవాలు! చేసిన తప్పు చేయకుండా..పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లేందుకు స్వీయానుభవం గీటురాయి అవుతుంది. ఎక్కడో పనిచేసి సంపాదించిన అనుభవం కంటే సొంత ఆలోచనతో..నైపుణ్య సాధనతో సంపాదించుకునే అనుభవమే తిరుగులేనిది! ఇలాంటి అనుభవం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఎలాంటి సవాలునైనా అధిగమించగలిగే ఆలోచనా పాటవమూ ఇనుమడిస్తుంది. ఇది పోటీ ప్రపంచం కాబట్టి మీకున్న అనుభవం ఎప్పటికప్పుడు పదునెక్కితే తప్ప..ఆలోచనాత్మకంగా ముందుకు దూసుకు పోయే అవకాశం ఉండదు. అందుకే నైపుణ్యానికి నిరంతర సానపెట్టడం ద్వారానే స్వీయ ప్రకాశంతో ఎదిగేందుకు...పది మందికీ ఆదర్శంగా నిలిచేందుకూ ఆస్కారం ఉంటుంది. కొందరికి ఆలోచనే అనుభవం..చుట్టూ జరిగే పరిణామాలను, పరిస్థితుల్ని లోతుగా గమనించడమే అనుభవం..ఎదుటివాడి వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడమే అనుభవం..ఇలాంటి అనుభవం కేవలం నిర్దేశిత రంగంలో పని చేస్తే వచ్చేది కాదు..‘పని’పట్టడంతో సాధించినప్పుడే సాధ్యమవుతుంది. ఇలాంటి అనుభవాలే నాయకత్వ లక్షణాలను ప్రోదిచేస్తాయి. పది మందికీ ఆదర్శంగా నిలిచేలా..తాను స్వీయ ప్రతిభతో నిలబడేలా చేస్తాయి. అందుకే అవకాశాలే వ్యక్తుల ప్రతిభకు గీటురాయి అవుతాయి. ఇలాంటి అవకాశాలు అందివచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి..వాటి ఆలంబనగానే అందలాలు అధిరోహించగలగాలి..ఓ రంగంలో ఓ వ్యక్తి ఆరితేరాడంటే దాని వెనుక అతడి కృషి, పట్టుదల అన్నింటికీ మించి ఎంచుకున్న రంగంలో అనదైన ముద్ర వేయాలన్న తపన కచ్చితంగా ఉంటాయి. ఈ లక్షణాలు మీలో ఉంటే ఎంచుకున్న రంగంలో రాణించేలా నైపుణ్యానికి పదును పెట్టుకోంది. ఆ విధంగా కెరీర్ దారులూ విస్తరించుకోండి!

-బి.సుధ