యువ

‘పరీక్ష’ ఇక తేలికే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లడ్ సుగర్!
ఇదొచ్చిందంటే...ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. పైగా రక్తంలో చక్కెర శాతం పెరిగితే ఒక తంటా...తగ్గితే మరో తంటా. బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాల్సిందే. అలా రక్తంలో చక్కెర సమతూకంలో ఉండేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, ఎప్పటికప్పుడు రక్త పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. రక్త పరీక్ష కోసం నరానికి ఇంజెక్షన్ చేయించుకోవడం లేదా వేలి చివర సూదితో గుచ్చి, ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా చూసుకోవడమో బాధాకరమే కదా! అయితే భవిష్యత్తులో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆ బాధ ఉండకపోవచ్చు. ఎందుకంటే- ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ ఓలోంగాంగ్‌కు చెందిన పరిశోధకులు కాపర్‌ను ఉపయోగించి స్పాంజ్‌లాంటి ఓ ఫిల్మ్‌ను తయారు చేశారు. కాపర్, పాలీస్టిరీన్‌లతో ద్రవరూపంలో ఉండే మిశ్రమాన్ని తయారు చేశామని, ఈ మిశ్రమంతో స్పాంజ్ లాంటి ఫిల్మ్‌ను తయారు చేశామని పరిశోధనలకు నేతృత్వం వహించిన యుసుకె యమయుచి వివరించారు.
ఇంకా పేరు పెట్టని ఈ ఫిల్మ్‌పై వెంట్రుక కంటే పదివేల రెట్లు తక్కువ మందం కలిగిన సూక్ష్మాతిసూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయని, వీటిలో అమర్చిన వేరబుల్ సెన్సర్లు చెమటను గ్రహించి, దానిని విశే్లషించి రక్తంలో చక్కెర శాతాన్ని లెక్కవేస్తాయని ఆయన చెప్పారు. కన్నీళ్లనూ గ్రహించి, చక్కెర శాతాన్ని అంచనా వేసే శక్తిసామర్థ్యాలు ఈ పరికరానికి ఉంటాయన్నారు. ఈ కాపర్ ఫిల్మ్‌ను వేరబుల్ డివైసెస్‌లో అమర్చుకుంటే చాలు...ఎప్పుడు కావాలంటే అప్పుడు రక్తంలో చక్కెర శాతాన్ని పరీక్షించుకోవచ్చు. అంతేకాదు, సంబంధిత యాప్ ద్వారా ఈ రిపోర్టును నేరుగా డాక్టర్‌కు పంపించి, మెడికేషన్‌లో మార్పులు చేర్పులు చేయించుకోవచ్చు. పైగా ఈ కాపర్ ఫిల్మ్ ధర చాలా చవకగా ఉంటుందట. కాబట్టి దానిని అమర్చిన వేరబుల్ డివైస్ కూడా చవకగానే దొరుకుతుంది. క్లినిక్కులు, పాథాలజీ సెంటర్లూ లేని గ్రామీణ ప్రాంతాలకు ఇదో వరం. ఈ పరిశోధన ఫలితాలు ఓ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అయితే ప్రస్తుతం పరిశోధనల దశలో ఉన్న ఈ కాపర్ ఫిల్మ్ వినియోగంలోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టొచ్చు.