యువ

వేడెక్కే లంచ్‌బాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజూ ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో తింటే ఆరోగ్యం ఏంగాను? అలాగని ఆఫీస్‌కి లంచ్ బాక్స్ తీసుకెళ్తే, ఆ సమయానికి భోజనం చల్లబడిపోయి, తినబుద్ధి కాదు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారికి పరిష్కారంగా త్వరలో మార్కెట్లోకి ‘హీట్స్‌బాక్స్’ రాబోతోంది. ఇదో లంచ్‌బాక్స్. దీని అడుగు భాగంలో 85 వాట్ల ఓవెన్ లాంటి హీటర్ ఉంటుంది. యుఎస్‌బి సాయంతో ఇది వేడెక్కుతుంది. కాకపోతే బాక్స్‌లోని ఆహార పదార్ధాలు వేడెక్కడానికి పావుగంట సమయం పడుతుంది. అంటే, లంచ్ టైమ్‌కు ముందే స్విచాన్ చేస్తే సరి. స్విట్జర్లాండ్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘ఫెయిట్రాన్’ ఈ హీట్స్‌బాక్స్‌ను రూపొందించింది.