యువ

వెండితెరపై బంగారు తంగవేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌ను బయోపిక్స్ ఫీవర్ పట్టి కుదిపేస్తోంది. ఎవర్ని కదిలించినా ఏదో బయోపిక్ గురించి మాట్లాడేవారే! తాజాగా దంగల్ కాసుల వర్షం కురిపిస్తోంది. అంతకుముందు ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ, అజర్ ఒక ఊపు ఊపితే వాటికంటేముందు వచ్చిన మేరీ కోమ్, భాగ్ మిల్ఖా భాగ్ వంటి సినిమాలు యువతకు కిర్రెక్కించాయి. బాలీవుడ్ అందించిన స్ఫూర్తితో ఇప్పుడు తమిళ నిర్మాతలు కూడా ఆ దిశగా అడుగు వేస్తున్నారు.
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తాజాగా ఓ బయోపిక్‌తో ముందుకొస్తోంది. ఇటీవల పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న దివ్యాంగుడు మరియప్పన్ తంగవేలు జీవిత కథనే ఐశ్వర్య సినిమాగా తీయబోతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నది కూడా ఐశ్వర్యే కావడంతో ఈ బయోపిక్‌పై అంచనాలు ఊపందుకుంటున్నాయి. సినిమా ఫస్ట్‌లుక్‌ని ఇటీవలే షారుఖ్ ఖాన్ విడుదల చేయడం మరో విశేషం.
ఇంతకీ ఈ సినిమాపై తంగవేలు ఏమంటున్నాడు? ‘రెండు నెలల కిందట చిత్ర నిర్మాతలు నన్ను కలిశారు. నా జీవిత కథ ఆధారంగా సినిమా తీయాలని అనుకుంటున్నట్టు చెప్పగానే ఎంతో సంతోషించాను. నాలాంటి అథ్లెట్లకు ఈ సినిమా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నమ్ముతున్నాను. అయితే ఇంకా వారితో నాకు కాంట్రాక్ట్ కుదరలేదు. బహుశా త్వరలో చెన్నైలో కాంట్రాక్ట్ పేపర్లపై సైన్ చేసే అవకాశం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు తంగవేలు. సినిమా గురించి చెబుతూనే త్వరలో తాను సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలవబోతున్నట్టు కూడా వెల్లడించాడు.
సాలెం దగ్గర పెరియడగమ్‌పట్టి అనే కుగ్రామం నుంచి వచ్చిన మరియప్పన్‌ను ఓ అథ్లెట్‌గా తీర్చిదిద్దడం వెనుక అతని తల్లి పాత్ర ఎంతో ఉంది. తంగవేలుకు ఐదేళ్ల వయసున్నప్పుడు ఓ తాగుబోతు లారీ డ్రైవర్ ఢీకొనడంతో అతని కుడి మోకాలు నుజ్జునుజ్జయింది. తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోతే, తల్లే తండ్రయి, కుటుంబాన్ని సాకింది. ఏళ్ల తరబడి ఇటుకల బట్టీలో పనిచేస్తూ, కుటుంబాన్ని పోషించింది. గుండె జబ్బు రావడంతో ఆ పనికి స్వస్తి చెప్పి, కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది. మరియప్పన్‌కు ఆటలపై ధ్యాస మళ్లేలా చేయడంలో ఆమెదే కీలకపాత్ర. బంగారు పతకం సాధించిన కొడుకును చూసి మురిసిపోయిన ఆ తల్లి, తనయుడి జీవిత కథను వెండితెరపై చూసి ఏమంటుందో వేచి చూడాలి.

చిత్రం..ఐశ్వర్య ధనుష్