యువ

ఈ-తరం వ్యాపారవేత్తలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కాలక్షేపం కోసం కాదు.. సామాజిక మీడియాతో వారు తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. తమ ఆలోచనలకు పదునుపెట్టి- సోషల్ మీడియా వేదికగా ‘కాసుల పంట’ సాధ్యమేనని ఆ యువతులు నిరూపిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు అమ్మాయిలు సామాజిక వెబ్‌సైట్ల ద్వారా వివిధ ఉత్పత్తులు విక్రయిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అలంకరణ సామగ్రి, బొమ్మలు, స్టేషనరీ వస్తువులు, దుస్తులు వంటివి వీరు విక్రయిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ఇందుకోసం వీరు సోషల్ మీడియాలో ఆకర్షణీయ పేర్లతో వెబ్ పేజీలను ఆవిష్కరించారు. వివిధ రకాల వస్తువులను విక్రయించాలంటే షాపులను అద్దెకు తీసుకోవడం పాత పద్ధతి అని వీరు అంటున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రచారం వంటివేవీ లేకుండానే, సోషల్ మీడియాలో తమ ఉత్పత్తులకు ఫోన్ లేదా మెయిల్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటారు.
హైదరాబాద్ నగరానికి చెందిన శ్రుతి, తాన్యా అగర్వాల్ ‘ది ట్రింకాహాలిక్’ పేరిట సోషల్ మీడియాలో నిర్వహిస్తున్న వెబ్ పేజీ ఇప్పటికే ప్రసిద్ధి చెందింది. ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాలతో తమ మదిలో కొత్త ఆలోచన వచ్చిందని, బొమ్మలు, అలంకరణ సామగ్రి విక్రయాలకు హైదరాబాద్‌కి సంబంధించి వెబ్ పేజీ ఏదీ లేకపోవడంతో ‘ది ట్రింకాహాలిక్’ను ప్రారంభించామని వీరు చెబుతున్నారు. కాలేజీ అమ్మాయిలకు అనువైన అలంకరణ వస్తువులను విక్రయించేందుకు గత ఏడాది ఈ వెబ్ పేజీని ప్రారంభించామని వివరిస్తున్నారు. పెద్ద ఖర్చేమీ లేకుండా, ఇంట్లో పేరెంట్స్ ఇచ్చే ప్యాకెట్ మనీతో అమ్మాయిలు చిన్న చిన్న వస్తువులను కొనుక్కునే వీలుందని శ్రుతి, తాన్యా అంటున్నారు. ఫొటోగ్రాఫర్లు, డిజైనర్లు, వస్తువులను విక్రయించాలనుకునేవారికి తమ వెబ్‌పేజీ అండగా నిలుస్తూ వారు ఎంతోకొంత సంపాదించేందుకు సాయపడడం తమకెంతో ఆనందం కలిగిస్తోందని ఈ యువతులు చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ అవకాశాలు దక్కేందుకు ఈ తరహా వెబ్‌పేజీలకు సోషల్ మీడియా వేదిక అయిందని గుర్తు చేస్తున్నారు. ‘ఇన్‌స్టాగ్రామ్’లో ‘క్రియేషన్స్’ పేరుతో వెబ్‌పేజీ నిర్వహిస్తున్న అక్కచెల్లెళ్లు కావ్య, కుసుమ కూడా హస్తకళలు, నగలు ఇతర అలంకరణ వస్తువులను విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ ఇద్దరిలో కావ్య మార్కెటింగ్, రవాణా వంటి వ్యవహారాలను చూస్తుండగా, వినియోగదారుల అభిరుచుల మేరకు పలు ఉత్పత్తులను సమకూర్చడంలో కుసుమ నిమగ్నమై ఉంటుంది. కస్టమర్ల బడ్జెట్‌కు అనుకూలంగా వారు మెచ్చే వస్తువులను అందుబాటులో ఉంచడం ఎంతో ముఖ్యమని వీరు అంటున్నారు. మొదట్లో కుసుమ ఖాళీ సమయంలో పలురకాల నగలు, అలంకరణ సామగ్రిని రూపొందించేది. బంధువుల ప్రోత్సాహంతో ఆమె తన నైపుణ్యానికి పదునుపెట్టి ఉత్పత్తులను విక్రయించేందుకు సోషల్ మీడియా అనువైన వేదిక అని భావించింది. ప్రస్తుతం వీరికి యుకె, యుఎస్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. తమ సంపాదనలో కొంత మొత్తాన్ని వెచ్చిస్తూ వృద్ధాశ్రమాల్లో అనాథలకు, వికలాంగులకు పుస్తకాలు, ఆహారం వీరు అందజేస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు.
‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్’లో శిక్షణ పొందిన ప్రార్థనా జైన్ ‘పీప్ స్ట్రీట్ ఫ్యాషన్’ పేరిట సోషన్ మీడియాలో సొంతంగా ఆన్‌లైన్ స్టోర్ నడుపుతోంది. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి చూపే ఆమె ఆ రంగానే్న తన కెరీర్‌గా ఎంచుకుంది. భారీ పెట్టుబడులు అవసరం లేకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసేందుకు సోషల్ మీడియా ఎంతో అనువుగా ఉందని అంటోంది. నగలు, దుస్తులు, బ్యాగులు వంటివి విక్రయించేందుకు ఆమె 2012లో వెబ్‌పేజీని ప్రారంభించింది. సంపాదన పెరగడంతో ప్రార్థన ఇపుడు సొంతంగా ఓ స్టోర్‌ను నడుపుతోంది. వినియోగదారుల అభిరుచుల మేరకు పలు రకాల ఫ్యాషన్ వస్తువులు, జుయలరీని అందుబాటు ధరలకు అందిస్తున్నట్లు ఆమె వివరిస్తోంది. మార్కెటింగ్‌కు ఎలాంటి శ్రమ లేకుండా, వ్యక్తిగతంగా వ్యాపార రంగంలో ఎదగాలనుకునేవారికి సోషల్ మీడియా మంచి అవకాశాలు కలిపిస్తోందని ప్రార్థన ఆనందం వ్యక్తం చేస్తోంది.

చిత్రాలు..శ్రుతి, తాన్య , కావ్య, కుసుమ, ప్రార్థనా జైన్

- ఎస్‌ఆర్