యువ

సూపర్ కిడ్! హర్షవర్థన్ జాలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్నాలుగేళ్ల ఈ బాలుడి పేరు ఇప్పుడు ఏ కొద్దిమందికో తెలుసు. భవిష్యత్తులో మాత్రం అతని పేరు మార్మోగిపోవడం ఖాయం...ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే మరి!
ఇటీవలే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు ఘనంగా జరిగింది. వేల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరాయి. అందులో ఐదు కోట్ల రూపాయల విలువైన ఓ బుల్లి ఒప్పందమూ ఉంది. అది కాదు విశేషం. గుజరాత్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందం హర్షతోనే కావడమే విశేషం.
ఏమిటా ఒప్పందం అంటారా? రెండు పదుల వయసు కూడా లేని ఈ బుడతడు, చదువుతున్నది పదో తరగతే అయినా...మందు పాతర్లను సునాయాసంగా కనిపెట్టే టెక్నాలజీని రూపొందించాడు. అతని ప్రతిభకు ఆశ్చర్యపోయిన ప్రభుత్వం వెంటనే అతనితో ఒప్పందం ఖరారు చేసుకుంది. ఇంతకీ హర్ష టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
మందుపాతరలను కనిపెట్టేందుకు హర్ష డ్రోన్లను ఎంచుకున్నాడు. వాటిలో ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్లు, థర్మల్ మీటర్, ఆర్‌జిబి సెన్సర్ వంటివి అమర్చాడు. అలాగే 21 మెగా పిక్సెల్ బిల్టిన్ కెమెరాను కూడా ఏర్పాటు చేశాడు. ఈ డ్రోన్లు గాల్లో ఎగురుతూ మందు పాతరలు ఎక్కడెక్కడ ఉన్నాయో పసిగట్టి, ఆ సమాచారాన్ని కేంద్ర స్థావరానికి చేరవేస్తాయి. పనిలోపనిగా ఇవి బాంబులనూ మోసుకెళ్లి, మందుపాతరలను ధ్వంసం చేస్తాయి కూడా.
ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తీరిక చేసుకుని హర్ష ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం విశేషం. ఇందుకు సంబంధించి రకరకాల ప్రోటోటైప్‌లను తయారు చేయడంలో అతను ఇప్పటికే ఐదు లక్షల రూపాయల వరకూ ఖర్చు చేశాడట. అన్నట్టు... అతను తన ప్రాజెక్టుకు ‘ఏరోబోటిక్స్ 7 టెక్ సొల్యూషన్స్’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. తన కృషి వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందంటాడు హర్ష. అసలు మందుపాతరలను కనిపెట్టడానికి ఓ టెక్నాలజీని రూపొందించాలని ఎందుకు అనిపించిందని అడిగితే ‘ఓ రోజు టెలివిజన్‌లో వార్తలు చూస్తున్నప్పుడు సైనికులపై ఓ కథనం చూశాను. మందుపాతరల కారణంగా ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిశాక, వారి గురించి ఏదైనా చేయాలనిపించింది’ అంటూ వివరించాడు హర్ష. అతని ప్రయోగాలు ఫలిస్తే, భారత సైన్యానికి సరికొత్త ఆయుధం చేతికి దొరికినట్లవుతుందనడంలో సందేహం లేదు.