యువ

ధారవిలో షాపింగ్ భలే ఈజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్ర సృష్టించిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమా చూసిన వారికి ధారవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడల్లో ఒకటిగా పేరొందిన ధారవిని ఉద్ధరించేందుకు ఎన్నో ఎన్జీవోలు రేయింబవళ్లూ పనిచేస్తున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలోకి ఐఐటి-ముంబయి విద్యార్థులు కూడా చేరారు.
ధారవిలో ఈ విద్యార్థులు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ధారవిలోని దుకాణ యజమానులు-వినియోగదారులకు మధ్య నేరుగా ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో ధారవిలో ఉన్న దుకాణాల్లో వ్యాపారం పుంజుకోవడమే కాకుండా, వినియోగదారులకు ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో, ఏది సమీపంలో ఉందో తెలుసుకునే వెసులుబాటు కలిగింది.
ముంబయి ఐఐటిలోని ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్‌కు చెందిన విద్యార్థులు ఇటీవల బ్రిటన్‌లోని స్వాన్‌సీ యూనివర్శిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు బీకాన్ అనే పరికరాన్ని ధారవిలోని పలు దుకాణాలకు అమర్చారు. ఈ బీకాన్లు...ఇంటర్నెట్, జిపిఎస్, బ్లూటూత్ సౌకర్యం ఉన్న స్మార్ట్ఫోన్‌తో ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతాయి. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే...ఉదాహరణకు మీరో ప్రదేశంలో ఉన్నారనుకోండి. ఆ పరిసర ప్రాంతాల్లోని దుకాణాల గురించి, వాటిలో అమ్మే వస్తువుల గురించిన సమాచారం మీ స్మార్ట్ఫోన్‌కు అందుతుంది. దీనివల్ల షాపింగ్ ఎంతో సులువవుతుంది. అలాగే దుకాణదారుకు, వినియోగదారుకూ మధ్య రిలేషన్‌షిప్ పెరుగుతుంది. అలాగే బయటి కాలనీలవారూ ధారవికి వచ్చి వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థవల్ల ధారవి స్థితిగతులే మారవచ్చునని అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు ధారవిలోని దుకాణదారులు తమ దుకాణాల ముందు ‘దయచేసి మీ స్మార్ట్ఫోన్‌లో బ్లూటూత్‌ను ఆన్‌చేసి ఉంచండి’ అంటూ పోస్టర్లు అంటిస్తున్నారు. సో, ఈసారి మీరెప్పుడైనా ధారవికి వెడితే, మీ ఫోన్ డివైస్‌లో బ్లూటూత్ ఆన్ చేయడం మరచిపోకండేం?

చిత్రం..ధారవిలోని ఓ దుకాణం...బ్లూటూత్‌ను ఆన్ చేయండంటూ ఏర్పాటు చేసిన బోర్డు