యువ

సుత్తితో బాదినా పగలదట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ఫోన్‌కు రకరకాల స్క్రీన్‌గార్డ్స్ అందుబాట్లో ఉన్నాయి. అయినా వాటి పని అంతంతమాత్రమే. కాస్త పైనుంచి పడితే స్క్రీన్ గ్లాస్ అంతే సంగతులు. అయితే ప్రొటెక్ట్‌పాక్స్ ఇన్విజబుల్ స్క్రీన్ ప్రొటెక్టర్‌ను ఉపయోగిస్తే స్మార్ట్ఫోన్ గ్లాస్‌ను సుత్తితో బాదినా పగలదట. ప్రొటెక్ట్‌పాక్స్ అనేది నానోటెక్నాలజీతో రూపొందించిన లిక్విడ్ గ్లాస్. ఫోన్ స్క్రీన్‌ను శుభ్రంగా తుడిచి, స్క్రీన్‌పైన లిక్విడ్ గ్లాస్‌ను జాగ్రత్తగా అమర్చితే చాలు. పది నిమిషాల్లో అది చక్కగా అతుక్కుపోతుంది. ఇది పగలమన్నా పగలదట. పైగా ఇది ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్‌నుంచి ఫోన్‌కు రక్షణ కల్పిస్తుందట. ప్రొటెక్ట్‌పాక్స్‌ను స్మార్ట్ఫోన్లకే కాదు, స్మార్ట్ వాచెస్, టాబ్లెట్లు వంటి గాడ్జెట్లకు వాడొచ్చట.