యువ

డిజైనర్ డ్రీమ్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఓనమాలు నేర్చుకుంటున్న తరుణంలోనే అంతర్జాతీయ వేదికపై ప్రతిభాపాటవాలు కనబరిచే అవకాశం రావడం అరుదైన విషయం. అలాంటి అరుదైన అవకాశాన్ని హైదరాబాద్‌కు చెందిన పంథొమ్మిదేళ్ల సలోనీ జైన్ చేజిక్కించుకుంది. హిమాయత్‌నగర్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో రెండో ఏడాది చదువుతున్న సలోనీ, ఓవైపు చదువుకుంటూనే మరోవైపు తన ప్రతిభకు సానపెట్టుకుంటోంది. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన సలోనీపై ఇక్కడి సాంప్రదాయాలు, సంస్కృతుల ప్రభావం ఎక్కువ. వీటిని బ్యాక్‌డ్రాప్‌గా ఉపయోగిస్తూ సలోనీ రూపొందించిన స్కెచ్‌లు న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవడంతో ఫిబ్రవరి 18న జరిగే లండన్ ఫ్యాషన్ వీక్‌లో తన కలెక్షన్స్‌ను ప్రదర్శించే అవకాశం ఆమెకు దక్కింది. ఈ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనేందుకు ఇండియానుంచి కేవలం పదిమంది టాప్ డిజైనర్లకు మాత్రమే అవకాశం దక్కగా వారిలో సలోనీ కూడా ఒకరు కావడం విశేషం. ‘అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకునేందుకు నేనెంతో శ్రమ పడ్డాను. రకరకాల ఫ్యాబ్రిక్స్‌కోసం చండీగఢ్‌కు వెళ్లాను. ఆ తరవాత నా ఊహలకు సాకారమిచ్చే టైలర్లను వెదికి పట్టుకుని, వారికి నా డిజైన్ల గురించి వివరించాను. అలాగే హైదరాబాద్‌లోనే పెరగడంతో పలుమార్లు ఫలక్‌నుమా ప్యాలెస్, చౌమొహల్లా ప్యాలెస్ సందర్శించేదాన్ని. అక్కడ మొఘల్ ఆర్కిటెక్చర్ ననె్నంతగానే ఆకట్టుకుంది. ఆనాటి సాంప్రదాయ కళను నా డిజైన్లలో ప్రతిబింబించేలా చేశాను. అదే జడ్జీలను ఆకట్టుకుంది’ అంటూ వివరించింది సలోమీ. తన విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందనీ, ముఖ్యంగా ఆర్థిక సమస్యలను అధిగమించడంలో వారు అందించిన అండదండలు మరువలేనివని ఆమె చెప్పింది. తరుణ్ తహిల్యానీ, శాంతను, నిఖిల్, జార్జియో అర్మానీ వంటి డిజైనర్లను ఆదర్శంగా తీసుకునే సలోనీ భవిష్యత్తులో జాతి గర్వించే డిజైనర్‌గా ఎదగడమే లక్ష్యమంటోంది.