యువ

చదువుల తల్లి ఈతి అగర్వాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏం పని చేయాలో నిర్ణయించుకోండి...ఆ నిర్ణయం ప్రకారం పని చేయండి
- ఈతి అగర్వాల్
సిఎ ఆలిండియా టాపర్
**
చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది ఓ యజ్ఞం. ఆ యజ్ఞాన్ని అద్వితీయంగా పూర్తి చేసిన ఈతి అగర్వాల్ పేరు ఇప్పుడు తెలియనివారు లేరు. ఆమెది చిన్నప్పటినుంచీ కష్టపడే మనస్తత్వం. లక్నోకు చెందిన ఈతి తల్లిదండ్రులు ఇద్దరూ విద్యాధికులే. తండ్రి బిపిన్ అగర్వాల్ చార్టర్ట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. తండ్రిని చూసే ఈతి స్ఫూర్తి పొందానంటుంది. తల్లి మంజు అగర్వాల్ గృహిణి.
చిన్నప్పటినుంచీ చదువులో ముందుండే ఈతి పదో తరగతి పాసయ్యాక ఏం చేయాలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అప్పటికే తండ్రిని, అతని వృత్తినీ ప్రేమిస్తూ పెరిగిన ఈతి, తాను కూడా చార్టర్డ్ అకౌంటెంట్‌ను అవుతాననగానే తండ్రి బిపిన్ సంతోషం పట్టపగ్గాల్లేకుండా పోయింది. చదువులో ఆమెకు మార్గదర్శకత్వం ఆయనదే.
రికార్డులు బద్దలు కొట్టడం ఈతికి కొత్తేం కాదు. 2011లో ఐఎస్‌సి (12వ తరగతి)లో ఆలిండియా టాప్ ర్యాంక్ ఆమెదే. ఆ తర్వాత ఢిల్లీ శ్రీరామ్ కాలేజీలో బికామ్ చదివింది. సిఎలో ప్రవేశం కోసం నిర్వహించే కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సిపిటి)లో ఎతి అర్హత సంపాదించి, ఐపిసిసిలో మళ్లీ ఆలిండియా టాపర్‌గా నిలిచింది. 2015 జూన్‌లో కంపెనీ సెక్రటరీ ఎగ్జామినేషన్‌లోనూ ఆలిండియా టాప్ ర్యాంక్ ఆమెనే వరించింది. ఇన్ని ర్యాంకులు సాధించిన ఈతి, దేశం కోసం పనిచేయడమే తన లక్ష్యమంటుంది. సబ్జెక్ట్‌ను పరీక్ష కోణంలోంచి కాకుండా నాలెడ్జ్ పెంచుకునే కోణంలో చదివితే సక్సెస్ ఎవరికైనా సొంతమవుతుందంటుందామె.