యువ

స్కేటిస్తాన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కేటిస్తాన్ అనేది ఓ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ. చిన్నారుల్లో చదువుల పట్ల జిజ్ఞాస రగిలించేందుకు, సాధికారత సాధించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమిది. ప్రస్తుతం మజరె షరీఫ్ (ఆఫ్ఘనిస్తాన్), నోమ్‌ఫెన్ (కంబోడియా), జోహానె్నస్‌బెర్గ్ (దక్షిణాఫ్రికా)లలో స్కేటిస్తాన్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 5-7 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులు 1500 మంది వరకూ ఇక్కడ స్కేట్‌బోర్డింగ్‌తోపాటు జీవితపాఠాలూ నేర్చుకుంటున్నారు.
స్కేట్‌బోర్డ్ ఆలోచన వాస్తవానికి ఆస్ట్రేలియాకు చెందిన అలివర్ పెర్కోవిచ్ అనే ఆయనది. మూడు స్కేట్‌బోర్డులతో 2007లో ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన పెర్కోవిచ్, చిన్నారులు చదువులకు దూరంగా, అల్లరిచిల్లరిగా తిరుగుతుండటం చూసి చలించిపోయారు. వారిని పాఠశాలకు పంపేందుకు ఆయన ఎంచుకున్న విధానమే ‘స్కేటిస్తాన్’. 2009లో మజారె షరీఫ్‌లో ఆయన స్కేట్‌పార్క్‌ను ప్రారంభించారు. పార్క్‌కు అనుసంధానంగా ఓ స్కూల్‌నూ నడుపుతున్నారు. ఇక్కడ ఆటలూ, పాటలూ అన్నీ ఉచితం. స్కేటిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విధానం. ఎంతోమంది ఈ తరహాలో పాఠశాలలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారు.