యువ

ఓ స్కేట్‌బోర్డ్ కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ స్కేట్‌బోర్డ్
.. కులాల మధ్య పేరుకుపోయిన కుళ్లును కడిగేస్తోంది.
.. చిన్నారుల్లో ఐకమత్యం మొగ్గ తొడిగేందుకు దోహదపడుతోంది.
.. క్రమశిక్షణ నేర్పుతోంది. విద్యాబుద్ధులు గరుపుతోంది.
.. మనుషుల మధ్య అంతరాలను అంతం చేస్తోంది.
.. కలుషితమైన పెద్దల మనసుల్ని ప్రక్షాళన చేస్తోంది.
-జీవం లేని ఓ స్కేట్‌బోర్డ్‌కు ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఇదేగా మీ అనుమానం? అది తీరాలంటే... ఈ కథనం చదవాల్సిందే!
***
అనగనగా జాన్వర్ అనే కుగ్రామం. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉందది. కుల మత ద్వేషాలు ఎక్కువక్కడ. యాదవులది అగ్రకులం, ఆదివాసీలది నిమ్నకులం. ఆ గ్రామంలో మీనేశ్ అనే యాదవుల అబ్బాయి... రాము అనే ఆదివాసీల అబ్బాయికి మధ్య దోస్తీ కుదిరింది. ఒకరింటికి ఒకరు వెళ్లకపోయినా, దారిలో కనబడితే చక్కగా మాట్లాడుకునేవారు. చెట్లెక్కి, పుట్టలెక్కి ఆడుకునేవారు. ఇది యాదవుల కంట్లో పడింది. ఆదివాసీల కంట్లోనూ పడింది. యాదవులు మీనేశ్‌కి నచ్చజెప్పారు. రాము కుటుంబాన్ని హెచ్చరించారు. ఆదివాసీలు కూడా తమ బిడ్డను ‘అదుపు’లో పెట్టేందుకు ప్రయత్నించారు. అంతే..ఆ బాల్యమిత్రులిద్దరూ విడిపోయారు. దారిలో కనిపించినా ఒకరినొకరు పలకరించుకునేవారు కాదు. ఇక ఆటల సంగతి అటకెక్కిందని వేరే చెప్పాలా?
***
ఇలా ఉండగా ఆ ఊర్లో ఓ స్కేట్‌పార్క్ వెలిసింది. చాలా పెద్దది. చిన్నపిల్లలకు ఉచితం. వారికి స్కేట్‌బోర్డ్, గార్డ్, బూట్లు ఇచ్చి, స్కేట్‌బోర్డింగ్ చేయనిస్తారు. ఇది ఆనోటా ఈనోటా పాకింది. ఊళ్లోని పిల్లలంతా మెలమెల్లగా అక్కడికి వచ్చేవారు. ఆ స్కేట్‌బోర్డ్‌కు పెద్ద.. యురికే రీన్‌హార్డ్ (55). ఆమె జర్మనీకి చెందిన రచయిత్రి, సామాజికవేత్త. స్కేట్‌పార్క్‌కు వచ్చే పిల్లల్ని ఆవిడ ప్రోత్సహించేది. చక్కగా ఆడుకోనిచ్చేది. ఓ రోజు స్కేట్‌పార్క్ దగ్గరకు రాము వచ్చాడు. బయటే నిలబడి లోపల ఆడుకునేవాళ్లని చూస్తున్నాడు. అతని దగ్గరకు రీన్‌హార్డ్ వచ్చారు. ‘నీకూ ఆడుకోవాలని ఉందా?’ అని అడిగారు. అవునంటూ తలూపాడు రాము. ‘మరెందుకు ఆలస్యం..రా’ అంటూ అతని చేయిపట్టుకుని తీసుకెళ్లారు. రాముకు స్వయంగా గార్డ్ అమర్చి, బూట్లు తొడిగి, స్కేట్‌బోర్డ్ చేతిలో పెట్టారు. రాము మొహం వెలిగిపోయింది. మొదటిసారే అయినా స్కేట్‌బోర్డ్ ఎక్కి రయ్యిన దూసుకుపోయాడు. రెండు రౌండ్లు తిరిగేసరికి పాత స్నేహితుడు మీనేశ్ కలిశాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఆనందంతో చేతులు కలిపారు. స్కేట్‌బోర్డింగ్ అయ్యాక ఒకేచోట కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. హాయిగా ఇంటికి తిరిగివెళ్లారు.
-అలా స్కేట్‌బోర్డ్...కులాల అడ్డుగోడల్ని కూల్చివేసింది.
ఇప్పుడు స్కేట్‌పార్క్‌లో కులాలు, మతాలూ జాన్తానై. అంతా కలసి హాయిగా ఆడుకోవాలన్నదే నిబంధన.
***
మరి చదువులో? దానికీ రీన్‌హార్డ్ ఓ చిట్కా కనిపెట్టారు. అది అద్భుతంగా వర్కవుట్ అయింది. స్కేట్‌బోర్డ్‌కు వచ్చే పిల్లలకు ఆమె ఓ షరతు విధించారు. అదేంటంటే...‘నో స్కూల్...నో స్కేట్‌బోర్డ్’ అని. అంటే స్కూల్‌కి వెళ్లకపోతే స్కేట్‌పార్క్‌లో చోటు లేదని. దాంతో పిల్లలంతా విధిగా స్కూల్‌కీ వెడతారు. సాయంత్రం కాగానే స్కేట్‌పార్క్‌కి వచ్చేస్తారు. పైగా స్కేట్‌పార్క్‌లో స్నేహితులే స్కూల్లోనూ స్నేహితులు. స్కూల్లో స్నేహితులే స్కేట్‌పార్క్‌లోనూ స్నేహితులు కావడంతో ఈ రెండు చోట్లకీ కలసికట్టుగానే వెడతారు. వస్తారు. తమ పిల్లల్ని చూసిన తల్లిదండ్రుల్లోనూ మార్పు వచ్చింది...వస్తోంది. ఆదివాసీ పిల్లలతో తిరగొద్దని ఇప్పుడు యాదవులెవరూ తమ పిల్లల్ని కట్టడి చేయట్లేదు. యాదవుల పిల్లలతో స్నేహం చేయొద్దంటూ ఆదివాసీలు తమ పిల్లల్ని వారించడం లేదు.
***
రీన్‌హార్డ్ అంతటితో ఆగిపోలేదు. జాన్వర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో టై అప్ పెట్టుకున్నారు. తమ స్కేట్‌బోర్డ్‌కు వచ్చే పిల్లలకు కంప్యూటర్ అందుబాట్లో ఉంచేవారు. టాబ్లెట్లూ చేతికిచ్చేవారు. దాంతో చదువుకోవాలన్న తృష్ణ పిల్లల్లో మరింత పెరిగింది. శ్రద్ధగా స్కూల్‌కి వెళ్లేవారు. రీన్‌హార్డ్ కృషిని, దాని వెనుక ఉన్న పరమార్ధాన్నీ పాఠశాల హెడ్మాస్టర్ గ్రహించి, తోడ్పాటునందించడంతో ఫలితాలు వాటంతట అవే రాసాగాయి.

చిత్రం..జాన్వర్‌లోని స్కేట్ పార్క్, ఇన్‌సెట్‌లో రీన్‌హార్డ్