యువ

ఎస్కేప్ టూల్‌తో ఆత్మరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆపత్కాలంలో దుండగుల బారినుంచి ఆత్మరక్షణ చేసుకునేందుకు రకరకాల గాడ్జెట్లు అందుబాట్లోకి వచ్చాయి. పెప్పర్ స్ప్రే మొదలుకుని, కీచైన్‌లో అమర్చిన చిన్నపాటి కత్తులు, బటన్ ప్రెస్ చేయగానే మొన తేలిన కత్తి బయటకు వచ్చే గాడ్జెట్లు వంటివి వీటిలో కొన్ని. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ‘స్టింగర్ యుఎస్‌బి ఎమర్జెన్సీ ఎస్కేప్ టూల్’ కూడా అలాంటిదే. అయితే ఇది.. ప్రమాదవశాత్తూ కారులో ఎవరైనా ఇరుక్కుపోతే బయటపడేసే గాడ్జెట్. వాస్తవానికి ఇదో యుఎస్‌బి పోర్ట్. కారులో ఉపయోగించుకునేందుకు రూపొందించారు. ఇందులోనే ఓ చిన్న గ్లాస్ బ్రేకర్ ఉంటుంది. ఉదాహరణకు మనం ప్రయాణిస్తున్న కారు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు డోర్లు జామ్ అయిపోయాయనుకోండి. వెంటనే గ్లాస్ బ్రేకర్‌ను ఉపయోగించి, విండో గ్లాస్‌ను పగులగొట్టి బయటపడొచ్చన్నమాట. ఈ గాడ్జెట్ ధర సుమారు 22 డాలర్లు.