యువ

ఒకే ఒక్కడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతుల కష్టాన్ని చూసి అంతా అయ్యో అనేవారే! వారి కష్టాన్ని తన కష్టంగా భావించేవారు మాత్రం ఒకరో ఇద్దరో! అలాంటి ఒకరిద్దరిలో ఒకడు -శివ
పంట పండించలేక, పండించిన పంటను అమ్ముకోలేక యాతన పడుతున్న అన్నదాతను ఆదుకునేందుకు నడుం బిగించాడు- పాతికేళ్ల శివ.
అతను రాజస్థాన్‌లోని వెనుకబడిన జిల్లా కోట్దాకు చెందినవాడు. ఆ ప్రాంతంలో నేల సారవంతమైనది కాదు. నీటి సదుపాయం లేదు. చీడపీడలు సోకితే సలహా ఇచ్చే నాథుడు లేడు. పండిన పంటను ఉదయ్‌పూర్‌కు తరలించాలంటే దూరాభారం. రవాణా ఖర్చులు ఎక్కువ. దళారులకు ఓ దండం పెట్టి, పంటను తెగనమ్ముకోవలసిందే. ఇదీ అక్కడి పరిస్థితి.
ఇలాంటి సమయంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పేరొందిన ఎన్జీఓలతో కలసి చేపట్టే ‘ఎస్‌బిఐ యూత్ ఫర్ ఇండియా’ ప్రోగ్రామ్ తరపున రుచినిలో కెంప్ అనే పెద్ద మనిషి ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడి పరిస్థితిని స్వయంగా చూశాడు. కాట్దా ప్రాంతంలోని రైతులకు మొబైల్ అప్లికేషన్‌ని పరిచయం చేయడం మేలని భావించి, వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్పే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో శివ చిత్త కూడా ఎస్‌బిఐ యూత్ ఫర్ ఇండియా తరపున వచ్చాడు. అతని రాకతో కెంప్ ఆలోచన మరింత వేగంగా ముందుకు సాగింది.
కోట్దా ప్రాంతంలో సగటున ఒకో రైతుకు 1.5 హెక్టార్ల పొలం ఉంది. నీటి వసతి లేకపోయినా, పొలాన్ని సాగు చేసి, ఏదో ఒక పంట వేస్తారు. కానీ వారికి సూచనలు, సలహాలు ఇచ్చే వ్యవసాయ నిపుణులు లేరు. ఆ ప్రాంతానికి ఎవరైనా వ్యవసాయ నిపుణుల్ని తీసుకొద్దామన్నా, అంత శివారు ప్రాంతానికి వచ్చేందుకు ఎవరూ ఇష్టపడేవారు కాదు. పైగా మన దేశంలో ప్రతి వెయ్యిమంది రైతులకు ఒకరే వ్యవసాయ నిపుణుడు ఉన్నారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా శివచిత్త ‘ఆగ్రి డిజి క్లినిక్’ అనే వినూత్నమైన విధానానికి రూపకల్పన చేశాడు.
ఈ విధానంలో ప్రతి 50మంది రైతులకు ఒక డిజిటల్ టాబ్లెట్‌ను ఇస్తారు. ఈ 50మంది రైతులను ఓ వ్యవసాయ నిపుణుడితో కనెక్ట్ చేస్తారు. పంటలకు పట్టిన చీడపీడలు, నీటి వసతి, ఎరువులు, పురుగు మందుల వాడకంవంటి సమస్యలపై సదరు నిపుణుడు సలహాలు ఇస్తారు. రైతులు పంపిన ఫొటోలను టాబ్లెట్‌లో పరిశీలించి, తగు సూచనలు చేస్తారు. పైగా పంటలను మార్కెట్ చేసుకోవడాన్ని కూడా డిజిటలైజ్ చేయాలన్నది శివ ఆలోచన. కాట్దా ప్రాంతంలో ఏ రైతు ఏ పంట పండిస్తున్నాడో లెక్క గట్టి, మొత్తం ఎంత పంట వస్తుందో అంచనా వేసి, ఆ పంటను ఆన్‌లైన్‌లో అమ్మాలన్నది శివ ఆలోచన. ప్రస్తుతం 50 మంది రైతుల చొప్పున గ్రూపులుగా విడగొట్టి, వారిని ఆన్‌లైన్‌లో వ్యవసాయ నిపుణులతో అనుసంధానించే ప్రయత్నంలో ఉన్నాడు. తన ఆలోచనను శివ కరపత్రాలపై ముద్రించి రైతులకు పంచుతున్నాడు. దీనికి సై అన్న రైతులనుంచి ప్రొఫైల్స్‌నూ, ఫొటోలనూ కలెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఎస్‌బిఐ యూత్ ఫర్ ఇండియా టీమ్ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న తన ఆలోచన ఫలవంతమైతే, దానికి మరింత విస్తృతి కల్పించాలని శివ భావిస్తున్నాడు. అయితే తన ఆలోచన ఆచరణాత్మకం కావాలంటే నిధులు, వౌలిక సదుపాయాలూ ముఖ్యమంటున్న శివ, క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధుల సేకరణకు ప్రయత్నిస్తున్నాడు. అన్నదాతకు వెన్నుదన్నుగా ఉండాలనుకుంటున్న శివ ఆలోచన కార్యరూపం దాల్చాలని, అతని ఆశయం నెరవేరాలని ‘యువ’ కోరుకుంటోంది.
బెస్ట్ఫా లక్ శివ!