యువ

డ్రోన్ల భరతం పట్టే డేగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్రోన్స్...తలెత్తి ఆకాశంలోకి చూస్తే చిన్నపాటి లోహ విహంగాలు ఎగురుతూ కనిపిస్తాయి. అవే డ్రోన్స్. ఇండియాలో కాకపోయినా, ఐరోపా దేశాల్లో వీటి అమ్మకాలు లక్షల్లో జరుగుతున్నాయి. తక్కువ ఎత్తులో ఎగిరే హెలికాప్టర్లకు, చిన్నపాటి తేలిక విమానాలకు ఈ డ్రోన్లు అడ్డుపడి ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు నానాటికీ పెరుగుతున్నాయి. అలాగే కీలకమైన రహస్య సమాచారం తెలుసుకునేందుకు సంఘ వ్యతిరేక శక్తులు డ్రోన్లను వినియోగిస్తున్న సంఘటనలూ బోలెడు. ఈ బెడదకు చెక్ పెట్టేందుకు నెదర్లాండ్స్ పోలీసులు ఓ ఉపాయం కనిపెట్టారు. అదేంటంటే- ఇలాంటి డ్రోన్ల భరతం పట్టేందుకు శిక్షణ పొందిన డేగలను ఉపయోగించడం. ఎగురుతున్న డ్రోన్‌ను డేగ ఇట్టే పట్టి కిందకు తెచ్చేస్తుంది. డ్రోన్లు చిన్నవిగా, తేలిగ్గా ఉంటాయన్న సంగతి తెలిసిందే కదా! డ్రోన్ల పని పట్టేందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వం ‘ది గార్డ్ ఫ్రమ్ ఎబౌవ్’ అనే సంస్థ సహాయం కోరింది. ఈ మేరకు డ్రోన్లను ఎలా పట్టి తేవాలో ఈ సంస్థ డేగలకు శిక్షణ ఇస్తోంది. అదన్నమాట సంగతి!
*