యువ

విరాలీకి విజయోస్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదేళ్ల కిందటి మాట!
విరాలీ మోదీ అనే అమ్మాయి...ముంబయిలో పుట్టి తల్లిదండ్రులతోపాటు చిన్నతనంలోనే అమెరికాలోని పెన్సిల్వేనియాకు వెళ్లిపోయింది. మోడల్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని, యాక్టర్‌గా ఎదగాలని కలలు కంది. అందుకు తగ్గట్టే పెన్సిల్వేనియాలోనే మోడలింగ్ అండ్ యాక్టింగ్ కోర్సు పూర్తి చేసింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు తమ యాడ్‌లో నటించాలంటూ ఓ కూల్‌డ్రింక్ కంపెనీ ఆమెను ఇండియా రమ్మని ఆహ్వానించింది. విరాలీ ఎగిరి గంతేసింది. పెట్టే బేడా సర్దుకుని ఇండియా వచ్చేసింది.
అయితే మర్నాడు షూటింగ్‌కు వెళ్లాల్సి ఉండగా, ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. విరాలీకి ఉన్నట్టుండి మలేరియా సోకింది. ఆస్పత్రిలో చేరింది. డాక్టర్లు మలేరియా అని గుర్తించే లోగానే ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. 23 రోజులు కోమాలోనే ఉన్న తర్వాత, డాక్టర్లు పెదవి విరిచారు. లాభం లేదన్నారు.
అయితే..విరాలీ జీవితంలో మరో విచిత్రం జరిగింది. 24వ రోజున ఆమె కోమాలోంచి బయటపడింది. డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. అయితే...ఆమె నడుము భాగం చచ్చుబడిపోయింది. ఫలితంగా వీల్‌చైర్‌కే పరిమితమైంది.
అయితేనేం...ఈ అంగవైకల్యం ఆమెను మానసికంగా కుంగదీయలేదు. పైపెచ్చు...విరాలీ మరింత రాటుతేలింది. తన లక్ష్యం సాధించడానికి అంగవైకల్యం అడ్డుకాదని భావించింది.
కట్ చేస్తే...ఆమె ఇప్పుడు ఓ మోడల్...ఓ మోటివేటర్.
ఆ మధ్య మిస్ వీల్‌చెయిర్ ఇండియా పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.
తాజాగా ఆమె ఓ పోరాటానికి శ్రీకారం చుట్టారు. భారతీయ రైల్వే స్టేషన్లలో దివ్యాంగులకు సౌకర్యాల కోసమే ఈ పోరాటం. వీల్‌చైర్‌కే పరిమితమైన వారికి మన రైల్వే స్టేషన్లలో వీల్‌చైర్‌ను తోసుకు వెళ్లేందుకు తగిన ర్యాంపులు ఉండవు. ఇక వీల్‌చైర్‌లోంచి రైలులోకి ఎక్కడమయితే గగనమే. రెండు మూడు సందర్భాల్లో విరాలీ రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పోర్టర్ల సహాయం తీసుకోవలసి వచ్చింది. ఆ సమయంలో పోర్టర్లు ఆమెకు సాయం చేసే నెపంతో అసభ్యంగా ప్రవర్తించడం ఆమెను ఎంతో బాధించింది. పైగా రైలెక్కాక కూడా దివ్యాంగులకు ఉపశమనం లభించదు. ఎందుకంటే, రైళ్లలో టాయిలెట్లు వారికి అనుకూలంగా ఉండవు. వాటి వద్దకు వెళ్లాలన్నా అవస్థ పడాల్సిందే. ఇక విరాలీ విషయానికొస్తే, రైలెక్కాక టాయిలెట్‌కు వెళ్లలేక ఆమె డైపర్లు వాడతారు. కానీ, అందరి మధ్యలో డైపర్లు మార్చుకోవడమెలా? అందుకనే, అంతా పడుకున్నాకే, ఆమె ఆ పని చేస్తారు. రైలు ప్రయాణంలో తన అవస్థలను వివరిస్తూ ఆమె ఇటీవల ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ఓ పిటిషన్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. స్వయానా కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా ఆమె పడిన కష్టాలకు చలించిపోయారు. రైల్వే స్టేషన్లలో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించే విషయమై రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ఆమె లేఖ రాశారు. అయితే ప్రభుత్వంపై ఆధారపడకుండా విరాలీ కూడా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. ఫలితంగా దేశంలోనే దివ్యాంగులకు ర్యాంప్ నిర్మించిన మొట్టమొదటి రైల్వే స్టేషన్‌గా తిరువనంతపురం రికార్డులకు ఎక్కింది.
అయితే ఇంతటితో తన పోరాటం ఆగిపోలేందంటుంది విరాలీ. భారతీయ రైల్వే యావత్తూ దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు చేపట్టేంతవరకూ విశ్రమించనంటుందామె. దివ్యాంగులకోసం విరాలీ చేపట్టిన పోరాటం విజయవంతం కావాలని ‘యువ’ ఆశిస్తోంది!