యువ

ఆపద్బాంధవుడు! క్షతగాత్రులకు చేయూత బెంగళూరు యువకుడి ఔదార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనం ఒక్కళ్లమే ఏం చేయగలం?’- ఈ మాటలు చాలామంది నోట వినబడుతూ ఉంటాయి. ఎవరైనా సమాజానికి ఒకింత మేలు చేద్దామని భావిస్తే, ఆ వెంటనే వినబడే మాటలివే. వాస్తవానికి సమాజాన్ని మొత్తం ఉద్ధరించనక్కర్లేదు. కనీసం మన ఇంటి చుట్టుపక్కల పారిశుద్ధ్యాన్ని, పర్యావరణాన్నీ లేదా చిన్న పిల్లల సంక్షేమాన్ని..ఇలా ఏదో ఒక మంచి పనిని చేపడితే చాలు. అంతా ఇలా అనుకుంటే... సమాజం బాగుపడినట్టే. బెంగళూరుకు చెందిన కిరణ్ అనే యువకుడు ఇదే దారిలో ముందుకు వెడుతున్నాడు. తన వెనక ఎవరున్నారనేది పట్టించుకోకుండా, తనతోపాటు కలసి ఎవరూ అడుగు ముందుకు వేయకపోయినా నిరాశ చెందకుండా పదిమందికీ సాయం చేస్తున్నాడు. కిరణ్... బెంగళూరులోని బుల్ టెంపుల్ రోడ్డులో ఉండే ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తాడు. డిగ్రీ వరకూ చదివిన కిరణ్, ఉద్యోగం మినహా మిగతా సమయమంతా బుల్ టెంపుల్ రోడ్డులో జరిగే ప్రమాదాల్లో గాయపడిన వారికి చేయూతనందిస్తూ ఉంటాడు. ఆ రోడ్డులో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దాంతో అతను ఎక్కడ ప్రమాదం జరిగినా, వెంటనే అక్కడ వాలిపోతాడు. క్షతగాత్రులకు ఫస్ట్ ఎయిడ్ చేసి, సమీపంలోని శేఖర్ ఆస్పత్రికి వారిని తరలిస్తాడు. ప్రమాదంలో పాడైన వారి వాహనాలను గ్యారేజీకి తరలిస్తాడు. దీనికయ్యే ఖర్చును తన జేబులోంచే భరిస్తాడు తప్ప ఎవరినీ చేయి చాచి అడగడు. ఆ మధ్య కిరణ్ ఓ రోజు చామరాజ్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. బుల్ టెంపుల్ రోడ్డులోని ఓ మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, అక్కడ ఓ సైన్ బోర్డును ఏర్పాటు చేయాలని వారిని కోరాడు. వారు పట్టించుకోకపోవడంతో స్వయంగా తానే ఆ సైన్ బోర్డును ఏర్పాటు చేశాడు. దాంతో ఆ మలుపులో ప్రమాదాల సంఖ్య చాలా తగ్గిందట. కిరణ్‌లోని సేవాభావానికి స్ఫూర్తినొంది, అదే బంకులో పనిచేస్తున్న మరో ఐదుగురు కిరణ్‌తో చేతులు కలిపారు. వీరంతా కలిసి ఓ జట్టుగా ఏర్పడి, బుల్ టెంపుల్ రోడ్డులో రహదారి భద్రతకు పలు చర్యలు చేపడుతున్నారు. అన్నట్టు కిరణ్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ‘నమ్మ బెంగళూరు’ అవార్డుల ప్రదానోత్సవంలో అతనిని ‘రైజింగ్ స్టార్ అవార్డ్’కు నామినేట్ చేశారు కూడా. కిరణ్ సేవాభావాన్ని ఎవరైనా ప్రస్తుతించబోతే అతను సున్నితంగా వారిస్తాడు. ‘నేను ఎవరి మెప్పునూ ఆశించి ఈ పని చేయడం లేదు. చదువుకునే రోజులనుంచీ ఈ రోడ్డుపై ఎంతోమంది గాయపడటం చూస్తున్నాను. వారిని రక్షించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నానంతే. ఆ మాటకొస్తే, నేను సాయం చేసినందుకు క్షతగాత్రులు చెప్పే ‘్థంక్స్’ అనే మాటే నాకు ఎంతో తృప్తినిస్తుంది’ అంటాడతను.