యువ

బైకువీరుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిండా పదమూడేళ్లు లేని ఈ కుర్రాడి పేరు అనీత్ కుమార. రెవారీ అతడి స్వస్థలం. యువమేధావుల ప్రపంచంలో అతడికీ చోటుంది. సోలార్ పవర్‌తో నడిచే బైక్‌ను కనిపెట్టడమే అతడి ఘనత. బైక్‌ను రూపురేఖలు, పనిచేసే విధానం అంతా అతడి సొంత ఆలోచనల ప్రతిరూపమే. పైగా దీని తయారీకి పెద్దగా ఖర్చుకాదు. దీనిని నడపడం వల్ల పర్యావరణానికి హాని కలిగించే వాయువులూ విడుదలకావు. యాంటీ స్లీపింగ్ అలారమ్, ఛార్జింగ్ పోర్ట్స్ వంటి సదుపాయాలు దీనిలో ఉంటాయి. గరిష్టంగా గంటకు 20 కి.మి. వేగంతో తన బైక్ పరుగుపెడుతుందంటున్నాడు అనీత్ ధీమాగా! బైక్ వెనుకభాగంలో ఉండే బ్యాక్‌పానెల్స్ ద్వారా సౌరశక్తి సహాయంతో బైక్ పనిచేస్తుంది. పదమూడేళ్ల వయసులో బైక్ కొనమని అల్లరిచేసే ఆకతాయిలను చూసి ఉంటాం. కానీ వారికి భిన్నంగా అనీశ్ తనే సరికొత్త బైక్‌కు ప్రాణం పోయడం విశేషమే!

చిత్రం..సోలార్ బైక్‌పై అవనీత్