యువ

ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆశా ఖేమ్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్య ప్రాథమిక హక్కు. కానీ, మన దేశంలో ఈ హక్కు చాలామందికి ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. చదువుకునే అవకాశం లేక ఎందరో మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోతున్నారు. వారికే గనక ఓ అవకాశం ఇచ్చి చూస్తే అద్భుతాలు సృష్టిస్తారనడానికి సజీవ తార్కాణం ఆశా ఖేమ్కా. ఏడో తరగతి మధ్యలో ఆపేసిన ఆశా, ‘ఏషియన్ బిజినెస్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’గా ఎదగడానికి వెనుక స్ఫూర్తిదాయకమైన ఆమె ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం.
ఆశా స్వస్థలం బిహార్‌లోని సీతామర్హి జిల్లా. పదమూడేళ్ల వరకూ పాఠశాలకు వెళ్లింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆమెను చదువు మాన్పించేశారు. ఆడపిల్లలు రజస్వల అయ్యారనో, లేక పెళ్లి చేసేందుకో అప్పట్లో చదువు మానిపించడం చాలా సహజంగా జరిగేది. అలాగే ఆశాను పాఠశాలకు వెళ్లకుండా కట్టడి చేసిన కుటుంబ సభ్యులు, ఆ తర్వాత ఓ వ్యాపారవేత్తకు ఇచ్చి పెళ్లి చేసేశారు. ముగ్గురు పిల్లలు పుట్టాక, ఆమె భర్త లండన్‌లో ఉద్యోగం వెతుక్కున్నాడు. ఆయనతోపాటు ఆశా కూడా పిల్లల్ని తీసుకుని బయల్దేరింది. చదువూ సంధ్య లేని ఆశా, లండన్‌లో నానాపాట్లూ పడింది. ఇంగ్లీషు రాదు. చుట్టుపక్కలవాళ్లు ఏం మాట్లాడుతున్నారో అర్ధమయ్యేది కాదు. అలాంటి దశలో పట్టుదలతో టీవీ షోలు చూసి ఇంగ్లీషు నేర్చుకుంది. తనలాంటి ఇతర గృహిణులతో వచ్చీరాని ఇంగ్లీషులో మాట్లాడుతూ తన భాషకు పదును పెట్టుకుంది. ఓవైపు ఇంటిని చూసుకుంటూ, పిల్లల్ని సముదాయించుకుంటూనే కార్డ్ఫి యూనివర్శిటీలో చేరి, బిజినెస్‌లో డిగ్రీ పట్టా తీసుకుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఆ తర్వాత ఆశా వెనుదిరిగి చూసుకోలేదు. 2006లో ఆమె నాటింగామ్‌షైర్ కాలేజీలో లెక్చరర్‌గా చేరి, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రిన్సిపాల్ పోస్టును చేపట్టింది. ఆ తర్వాత అదే కాలేజీకి సిఇఓ కూడా అయింది. 2013లో బ్రిటన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘డేమ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ అవార్డు వరించింది. ఆశా యుకెలో ఈ అవార్డును దక్కించుకున్న రెండవ ప్రవాస భారతీయురాలు కావడం విశేషం. ఇక తాజాగా ఆమెను ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. గత 30 ఏళ్లుగా బ్రిటన్‌లోనే నివసిస్తున్న ఆశా ఖేమ్కాకు బ్రిటన్ పౌరసత్వమూ లభించింది. అయితే పుట్టినగడ్డను ఎన్నటికీ మరువలేనంటున్న ఆశా, త్వరలో ఇండియాలోనూ విద్యాపరమైన సేవలు అందించేందుకు నడుం బిగిస్తోంది.

చిత్రం..బ్రిటన్ రాణి ఎలిజబెత్ నుంచి ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డు అందుకుంటున్న ఆశా ఖేమ్కా