యువ

మనసంతా ఇండియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువులకోసమో, ఉద్యోగాల కోసమో రెక్కలు కట్టుకుని అమెరికాకు ఎగిరిపోతున్న కుర్రాళ్లలో వీలైతే అక్కడే సెటిలైపోదామనుకునే వాళ్లే ఎక్కువమంది. సాధ్యమైనంత త్వరగా గ్రీన్ కార్డు కూడా సంపాదించేసి మళ్లీ ఇండియా మొహం చూడకుండా అమెరికాలోనే ఉండిపోదామనుకునే భారతీయ కుర్రాళ్లకు కొదవ లేదు. సొంత ఊరు, మాతృదేశం గురించి ఆలోచించేవారు కరవవుతున్న ప్రస్తుత తరుణంలో ఓ కుర్రాడికి మాత్రం అమెరికాలో ఉంటున్నా, అతని ఆలోచనంతా మాతృదేశంపైనే. అక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఇక్కడి ప్రజల స్థితిగతులపైనా, వారు పడుతున్న ఈతిబాధలపైనే దృష్టంతా. పదిహేడేళ్లుగా అమెరికాలో ఉంటున్నా అతని ధ్యాసంతా తాను పుట్టి పెరిగిన ప్రాంతం మీదే. ఇక్కడి ప్రజలు.. ముఖ్యంగా రైతులు పడుతున్న అవస్థల మీదే. మూడు పదుల వయసులో ఇలా ఆలోచించేవారు ఉండటం విశేషమే. అతని పేరు ఈడిగ సురేశ్. తెలుగు గడ్డపై పుట్టి పెరిగి, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఇప్పటివరకూ లక్షలు సేకరించి, రైతుల శ్రేయస్సుకోసం వెచ్చించాడు.తాజాగా సురేశ్ ప్రారంభించిన ‘వన్ క్రోర్ ఫార్మర్ ఫండ్’కు అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో విశేష స్పందన లభిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడులలో రైతులకు సాయం చేసేందుకు ఈ ఫండ్ ద్వారా సురేశ్ నిధుల సేకరణకు నడుం బిగించాడు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడం, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరచడం, సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం, రైతు సంఘాలను ఏర్పాటు చేయడం, హెల్ప్‌లైన్ నిర్వహించడం వంటి వాటికి ఈ డబ్బును వినియోగిస్తారు. సేకరించిన నిధుల్లో 30నుంచి 40 శాతం వరకూ నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఆదుకోవడానికే వినియోగిస్తారు.
వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన సురేశ్, 2000 సంవత్సరంలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించుకుని సెటిలయ్యాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాల తరబడి కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలు అతణ్ణి అమెరికాలో ఉన్నా వెన్నాడాయి. ‘ఇండియాలో రైతుల కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అప్పటికీ రైతులు ఎంత కష్టపడాలో అంత కష్టపడుతూనే ఉన్నారు. కానీ, ఫలితం మాత్రం వారికి దక్కడం లేదు. మనం రోజూ తింటున్న అన్నం వారి పుణ్యమే. కానీ మనం వారికేం చేస్తున్నాం? రైతుల పట్ల మనకు బాధ్యత లేదా? ఈ ప్రశ్నలే నన్ను వన్ క్రోర్ ఫార్మర్ ఫండ్ ఏర్పాటుకు పురిగొల్పాయి’ అంటూ వివరించాడు సురేశ్.
సురేశ్ సేకరించిన నిధులు తెలంగాణలోని ‘సెంటర్ ఫర్ సస్టయినబుల్ అగ్రికల్చర్’ అనే ఎన్జీఓకు వెడతాయి. ఈ సంస్థ మరికొన్ని లాభాపేక్ష రహిత సంస్థలతో కలసి రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోంది. ఈ నిధులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలలోని రైతులకోసం వ్యయం చేస్తారు.
గతంలోనూ సురేశ్ మహారాష్టల్రోని విదర్భ రైతులను ఆదుకునేందుకు నిధులు సేకరించాడు. మరో నలుగురు స్నేహితులతో కలసి ‘జ4చ్ఘిౄళూఒ.్య’ అనే సంస్థను ఏర్పాటు ఛేశాడు. ‘గత ఏడేళ్లలో ఆరుకు పైగా నిధుల సేకరణ కార్యక్రమాలు చేపట్టి, 2నుంచి 21 లక్షల రూపాయల వరకూ సేకరించాను. ‘నిజానికి రైతుల సమస్యల పట్ల ప్రజలకు సానుభూతి ఉంది. వారికేదైనా చేయాలనే ఉద్దేశమూ ఉంది. కాకపోతే వారిని ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత ఎవరో ఒకరు భుజాలకెత్తుకోవాలి’ అంటున్న సురేశ్, ఈ కాలం కుర్రకారుకు ఆదర్శప్రాయుడనడంలో సందేహం లేదు.

చిత్రం..సురేశ్