యువ

హా‘కింగే’ ఆదర్శం...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీల్‌చైర్‌కే పరిమితమైన మన కుర్రాడు
ఫిజిక్స్.. ఖగోళశాస్త్రం మహాఇష్టం
ఇప్పటికే రెండు అవార్డులు సొంతం
హాకింగ్... ఈ పేరుకు పెద్ద పరిచయం అక్కర్లేదు. అంతో ఇంతో చదువుకున్న వారందరికీ ఆయన సుపరిచితుడే. చిన్నప్పుడే మహమ్మారి వ్యాధి సోకి వీల్‌చైర్ బారిన పడేలా చేసినా, అపారమైన తన తెలివితేటలకు పదును పెట్టుకుంటూ ప్రపంచం గర్వించే ఖగోళ శాస్తజ్ఞ్రుడిగా వినుతికెక్కాడు. ఇప్పటికీ ఆయన పరిశోధనలు ప్రపంచ పురోగమనానికి ఉపయోగ పడుతూనే ఉన్నాయి.
ఇప్పుడు మనకూ ఇలాంటి స్టీఫెన్ హాకింగ్ ఒకరు దొరికారు. కాకపోతే వయసులోనే తేడా. మిగతా అన్నిటిలోనూ డిటో. చివరకు వ్యాధికి గురై వీల్‌చైర్‌లోపడటంలోనూ మినహాయింపేమీ లేదు. హాకింగ్‌కు 75 ఏళ్లయితే, మన హీరోకి 17 ఏళ్లు మాత్రమే.
అతని పేరు తుహిన్ డే. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నపూర్‌కు చెందిన ఈ కుర్రాడు పుట్టుకతోనే వీల్‌చైర్ బారిన పడ్డాడు. ఆర్థ్రోగ్రైపోసిస్ మస్టిప్లెక్స్ కంజెనైటా (ఏఎంసి) అనే మహమ్మారి వ్యాధి అతణ్ణి కాటేసింది. కీళ్లు పెళుసుబారి పోవడం, కండరాలు బలహీనపడటం ఈ వ్యాధి లక్షణాలు. దీని కారణంగా తుహిన్‌కు పుట్టుకతోనే అంగవైకల్యం ప్రాప్తించింది. అయితేనేం, చదువులో ప్రతిభాపాటవాలు కనబరిచే తుహిన్, భవిష్యత్తులో ఐఐటిలో చేరి ఖగోళ భౌతిక శాస్త్రం చదివి, ఖగోళ శాస్తవ్రేత్తగా ఎదగాలన్నది తన అభిమతమంటున్నాడు. ఈ దిశగా ఇప్పటికే తుహిన్ రెండు ప్రతిష్ఠాత్మకమైన అవార్డులూ గెలిచాడు. వాటిలో ఒకదానిని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నాడు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసిన తుహిన్...ఐఐటి ఖరగ్‌పూర్‌లో బిటెక్ చదివి, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో చేరి మాస్టర్స్ డిగ్రీ చేయాలనుందంటున్నాడు. ఏనాటికైనా స్టీఫెన్ హాకింగ్‌ను కలవాలన్నది తన జీవితాశయమంటాడతను.