యువ

వర్కవుట్ రహస్యం చెవిలో చెబుతాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతిక అభివృద్ధి మానవ జీవితాన్ని సుఖమయం చేస్తోందనడానికి ఇదో ఉదాహరణ. నాజూకైన శరీర ఆకృతి, ఆరోగ్యం కోసం చాలామంది వ్యాయామం చేస్తారు. తాము ఎంతసేపు వ్యాయామం చేశామో, ఇంకా ఎంత సేపు చేయాలో, రక్తపోటు, హృదయ స్పందన రేటు ఎలా ఉందో, శరీరంలోని కొవ్వు ఎంతగా కరిగిందో, ఎన్ని కాలరీల శక్తి వినియోగించామో ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు డేటాను విశే్లషించి మనకు తెలిపే ఆధునిక ఎలక్ట్రానిక్ వివైస్‌లు అందుబాటులోకి వచ్చాయి. హెడ్‌ఫోన్, ఇయర్‌బగ్స్, షూస్, బ్రాస్‌లెట్ బాండ్స్, రిస్ట్ రింగ్స్ రూపంలో అవి వచ్చాయి. ఇప్పుడు మరో అధునాత డివైస్‌లు అందుబాటులోకి వచ్చాయి. పైగా అవి సమాచారాన్ని మన చెవిలో వినిపిస్తాయికూడా. చెవిరింగుల్లో అమర్చుకునే ఇయర్‌బగ్స్ రూపంలో వాటిని తీర్చిదిద్దారు. మహా అయితే 18 మిల్లీమీటర్ల సైజులో ఆ డివైజ్ ఉంటుంది. చెవిరింగులో ఇమిడిపోయి బయటకు కనిపించకుండా ఉంటుంది. జౌలే ఆప్‌తో ఐఒఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ది జౌలే ఆప్‌తో వీటిని వాడుకోవచ్చు. బ్లూటూత్ 4 వెర్షన్ సాంకేతికతతో అది పనిచేస్తుంది. జౌలే అని దీనికి పేరుపెట్టారు. రక్తపోటు, హార్ట్‌బీట్, వినియోగించిన కాలరీల గురించి, ఇంకా ఎంతసేపు వర్కవుట్ చేయొచ్చో అది సూచిస్తూ చెవిలో వివరాలు చెప్పేస్తుంది. ఈ డేటాను విని వదిలేయకుండా నిల్వకూడా చేసుకోవచ్చు. అయితే చెవి రింగులు ఎక్కువగా ఆడవారే ధరిస్తారు. మరి మగవారికి వీటి ఉపయోగం ఉంటుందా అంటే, ఉంటుందనే చెబుతున్నారు పరిశోధకులు. చెవికి పెట్టుకునే బటన్ లాంటి వస్తువులగా వీటిని అమర్చుకోవచ్చు. కెనడా కేంద్రంగా పనిచేసే బయోసెన్సివ్ టెక్నాలజీ సంస్థ ‘ఒన్‌టారియో’ ఇయర్‌రింగ్ బ్యాక్ ఫిట్‌నెస్ వేరబుల్స్‌ను ఉత్పత్తి చేసింది. ఎన్నో పరీక్షల తరువాత మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. బయొసెన్సివ్ టెక్నాలజీస్ ఇన్‌కార్పొరేషన్ అధ్యక్షుడు రవీందర్ సైని తమ సంస్థ తరపున ఇలాంటి డివైజ్‌నే ఉత్పత్తి చేశారు. ‘ఇయర్-ఒ-స్మార్ట్’ పేరిట దీనిని అందుబాటులోకి తెచ్చారు. సెన్సార్ ట్రాక్ విధానంలో అది సమాచారాన్ని మన చెవిలో చెబుతుంది. నాణంలాంటి బ్యాటరీ దీర్ఘకాలం పనిచేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎనిమిది గంటలపాటు అది పనిచేస్తుంది. వినియోగదారుల కోసం ఎన్నో ఆఫర్లను ఈ సంస్థ ప్రకటించింది. మేనిఛాయ, ఆహార్యం, ఇష్టాన్నిబట్టి తమకు నచ్చిన వజ్రాలు లేదా ఇతర జెమ్స్‌ను ఎంపిక చేసుకుని పొదిగేందుకు వీలైన 12 సెట్ల ఇయర్ రింగ్ ఫ్రేమ్స్‌తో కూడిన కిట్‌ను ఈ సంస్థ అందిస్తోంది. అంటే స్మార్ట్ ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇక వినియోగాదారుడికి మాత్రమే తమ ఆరోగ్య రహస్యం తెలుస్తుందన్నమాట.