యువ

రైతునేస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీఏ కావాలనుకున్న కుర్రాడు రైతుగా మారి వ్యాపారవేత్తగా ఎదిగాడు
సేంద్రియ వ్యవసాయంలో మేటి రైతులకు అండగా నిలిచిన సాహసి
శాస్తవ్రేత్తల శిక్షణలో ఉత్తమ ఫలితాలు

ఆలయంలోని పూలతోనూ..
వ్యర్థంగా పారేసిన ఆకులు, పూలు, పళ్లు, కూరగాయలు, చెత్తనూ అతడు వదల్లేదు. ఆలయాలకు వెళ్లి వాడి పడేసే పూలను తీసుకువచ్చేవాడు. చెరకుపిప్పిని సేకరించేవాడు. వేపాకులను, ఆవులు, గేదెల మూత్రాన్ని, పేడను పెద్దమొత్తంలో కలిపి వర్మీ కంపోస్టును తయారు చేశాడు. దీనివల్ల పురుగులు, తెగుళ్ల బెడద బాగా తగ్గింది. అదీగాక నేల సారవంతంగా మారింది. భూసార పరీక్షలలో ఇది తేలడంతో రైతుల్లో నమ్మకం పెరిగింది. అతడి పంట పండింది.

సీఎ కావలసిన ఆ కుర్రాడు.. రైతుగా ఎందుకు మారిపోయాడు?
భూమి కొని, పాడిపశువులను సాకి, స్వయంగా వర్మీ కంపోస్టును తయారు చేయడానికి ఎందుకు సిద్ధపడ్డాడు.
ససేమిరా అన్న తండ్రిని ఎలా ఒప్పించాడు. ఏటా 12 లక్షల టర్నోవర్‌తో ఓ వ్యాపారవేత్తగా ఎలా ఎదుగుతున్నాడు? ఓ పందొమ్మిదేళ్ల కుర్రాడు తను అనుకున్నది ఎలా సాధించాడు? విజయం ఎలా సాధ్యామైంది? అదే అసలు కథ.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలికి చెందిన ప్రతీక్ బజాజ్ తల్లిదండ్రులు ప్రాపర్టీ డీలర్లు. అన్నయ్య డెయిరీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. వ్యాపారంలో అండగా ఉండేందుకు ప్రణీత్ సీఎ చేయాలనుకున్నాడు. కామర్స్ అన్నా, లెక్కలన్నా ఇష్టపడే ప్రతీక్ సిపిటిలో ఉత్తీర్ణుడయ్యాడు. రోజుకు పది గంటలపాటు చదివాడు. ఇక రేపోమాపో సీఎలో ప్రవేశం... ఆ కోర్సులో చేరాక ఇక తీరిక ఎక్కడుంటుంది. అందుకే ఓసారి అన్నయ్యతో కలసి అలా తిరిగొద్దామని బయలుదేరాడు. డెయిరీ ఫామ్ నడుపుతున్న అన్నయ్య ఊరూరా తిరుగుతూ రైతులతో మాట్లాడటం నచ్చింది. పాల సేకరణ, రైతుల ఆత్మవిశ్వాసం ఉత్సాహాన్నిచ్చాయి. బయోవేస్ట్ మేనేజ్‌మెంట్ అంశంపై శాస్తవ్రేత్తలు, రైతులు ఇచ్చిన ఉపన్యాసం అతడిని ఆశ్చర్యంలో ముంచేసింది. నేలతల్లిని నమ్ముకుంటే ఉండే తృప్తి, సాధించే విజయం అన్నలో కనిపించాయి. తనుకూడా భూమినే నమ్ముకోవాలని అనుకున్నాడు. ఓ రోజు తల్లిదండ్రులకు అదే విషయం చెప్పాడు. తండ్రి ఒప్పుకోలేదు. తను ఏం చేయదలచుకున్నాడో, ఎలా చేయాలనుకున్నాడో వివరించి ఓ అవకాశం ఇచ్చి చూడాలని తండ్రిని ఒప్పించాడు. అయిష్టంగానే ఒప్పుకున్న ఆయన ఆ తరువాత సంతోషించాడు. ఎందుకంటే తన కుమారుడు ఇప్పుడు ‘షెయోగ్ బయోటెక్’ సంస్థకు యజమాని. తొలి ఏడాదిలోనే 12 లక్షల టర్నోవర్ సాధించిన విజేత. ఇంక ఆనందానికి ప్రత్యేక కారణం కావాలా? అయితే ఈ విజయం సాధించడానికి ప్రణీత్ చేసింది యుద్ధమే.
అన్నయ్యే స్ఫూర్తి
రెండేళ్లక్రితం ప్రతీక్ తన అన్నతో కలసి తిరుగుతూ లక్ష్యానే్న మార్చేసుకున్నాడు. అన్నయ్య నిర్వహిస్తున్న డెయిరీ ఫామ్‌లో వృధాగా ఉన్న పేడ, ఆవులు, గేదెల మూత్రం సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. పశువైద్యులు, వ్యవసాయాధికారులు, రైతులతో ఎన్నోసార్లు భేటీ అయ్యాడు. పత్రికలు, మ్యాగజైన్లను తిరగేశాడు. తనకంటూ ఓ ఆలోచనకు అసలు రూపం ఇచ్చాడు. తన అన్న శిక్షణ పొందుతున్న ఇజత్‌నగర్‌లోని కృషి విజ్ఞాన కేంద్రానికి వెళ్లి బయోవేస్ట్, వర్మీకంపోస్ట్ తయారీలో శిక్షణ పొందాడు. సంప్రదాయ పద్ధతులతోపాటు వినూత్న పద్ధతుల్లో, మెరుగైన వర్మీ కంపోస్టును తయారు చేయడం మొదలెట్టాడు. వేపాకులు, ఆవు, గేదెల మూత్రం ఎక్కువ మోతాదులో వేసి వర్మీ కంపోస్టును తయారు చేయడం మొదలెట్టాడు. స్వయంగా చేతులతో కష్టపడి పేడ కలిపేవాడు. మిగతావారు అందించే వర్మీకంపోస్టుకన్నా ప్రతీక్ సిద్ధం చేసినది ఉన్నత ప్రమాణాలతో కూడి, ఉత్తమ ఫలితాలను ఇవ్వడం మొదలైంది. సంప్రదాయ విధానాలనుంచి మారడానికి ఇష్టపడని రైతులను నమ్మించి, ఒప్పించి తను విభిన్నంగా తయారు చేసిన వర్మీ కంపోస్టును విక్రయించడం కష్టమైపోయింది. కానీ దిగుబడి పెరగడం, రసాయనిక ఎరువల ధరకన్నా చౌకగా ఉండటం, నేలసారం పెరగడంతో రైతులకు నమ్మకం కుదిరింది. మొదట్లో ఐదాగురు రైతులే అతడివద్ద వర్మీ కంపోస్టును కొనేవారు. ఇప్పుడు కనీసం 50 మంది రైతులు అతడి నుంచి నేరుగా కొంటున్నారు. ఇక పార్సిల్స్, పోస్ట్, డోర్ డెలవరీ ద్వారా కూడా అతడు వర్మీ కంపోస్ట్‌ను బట్వాడా చేస్తున్నాడు. తన ఆలోచనలు కార్యరూపంలోకి రాగానే పర్‌ధోలి గ్రామంలో ఏడు బిఘాల స్థలం కొనుగోలు చేశాడు. షయోగి బయోటెక్ సంస్థను ప్రారంభించాడు.
సేంద్రియ సాగుకు శ్రీకారం
వర్మీకంపోస్టు ప్రయోగం విజయవంతం కావడంతో కుటుంబ ప్రోత్సాహం లభించింది. రైతులు, అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్తవ్రేత్తలు అండగా నిలిచారు. మరికొంత స్థలం కొనుగోలు చేసి సేంద్రియ వ్యవసాయం మొదలెట్టాడు. పూర్తిగా తను తయారు చేసిన వర్మీ కంపోస్ట్‌నే వాడాడు. రసాయనిక ఎరువుల జోలికి వెళ్లలేదు. అద్భుతమైన ఫలితం వచ్చింది. ప్రస్తుతం అతడు పండింటిన పంటలు, వర్మీ కంపోస్టు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని నోయిడా, ఘజియాబాద్, బరేలి, షాహజాన్‌పూర్ తదితర గ్రామాల్లో ఇంటింటికీ సరఫరా చేసే స్థితికి చేరాడు. సంప్రదాయంగా ఇటుకతో చేసిన గుంతల్లో వర్మీ కంపోస్టు తయారు చేయడానికి భిన్నమైన పద్ధతులను అతడు అవలంబించాడు. చిన్నచిన్న కుండల్లో వర్మీకంపోస్టును తయారు చేయడం మొదలెట్టాడు. కొనుక్కున్నవారు తరలించడానికి వీలుగా ఉండటం, సులువుగా తయారు చేయగలగడంతో వాటికి ఆదరణ పెరిగింది. ఇది అతడి ఆలోచనల తీరుకు అద్దం పట్టింది. పందొమ్మిదేళ్ల వయసులో వినూతనంగా ఆలోచించి, సాహసంతో తీసుకున్న నిర్ణయం మూడేళ్లలో ప్రణీత్‌ను వ్యాపారవేత్తగా మార్చేసింది.

లాభాలు గడిస్తున్నా
-ప్రణీత్

చార్టెడ్ అక్కౌంటెంట్‌ను అయితే రోజుకు పది పనె్నండు గంటలు కష్టపడేవాడ్ని. రైతుగా, వ్యాపారవేత్తగా ఇప్పుడు రోజంతా పనిచేస్తున్నా. అయినా ఎంతో తృప్తిగా ఉంది. అలసట అనేదే లేదు. లాభాలూ వస్తున్నాయి. సంప్రదాయ విధానాల నుంచి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి రైతులను ఒప్పించడమే కష్టమైన పనిగా అనిపించింది. ఫలితం కనిపిస్తే వారు త్వరలోనే మనల్ని ప్రోత్సహిస్తారని అర్థం చేసుకున్నా. ఇప్పుడు వారంతా నాతోనే ఉన్నారు. అందుకే విజయం సొంతమైంది.