యువ

అదిగో కాలుష్యం... జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య కాలుష్యం. ముఖ్యంగా వాయుకాలుష్యం. దాదాపు అన్ని దేశాల్లోన్ని ప్రధాన నగరాలలో వాతావరణం కలుషితమైపోయింది. చైనా రాజధాని బీజింగ్, భారత రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్యపూరిత నగరాలుగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే. అటు లండన్‌లోనూ కాలుష్యభూతం ఆవరించే ఉంది. కాలం చెల్లిన వాహనాలు, పరిశ్రమల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. గాలిలో ధూళి పరిమాణం బాగా పెరిగిపోయి శ్వాసకోశ, నేత్ర, నాసికాసంబంధమైన వ్యాధులు, చివరకు కేన్సర్‌కు దారితీసే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఎప్పటికప్పుడు మనం తిరిగే ప్రాంతాల్లో వాయుకాలుష్యం పరిమాణం ఎలా ఉందో కనిపెట్టి ఆ సమాచారాన్ని మన స్మార్ట్ ఫోన్‌కు సమాచారం అందించే అధునాతన స్మార్ట్ పొల్యూషన్ ట్రాకర్‌ను అందుబాటులోకి తెచ్చింది ప్లూమె లాబ్స్. ఈ పరికరం కీచైన్ మాదిరిగా చిన్నదిగా ఉంటుంది. జేబులో పెట్టుకోవచ్చు. లేదా బ్యాక్‌పాక్‌కు తగిలించుకోవచ్చు. బైక్, సైకిల్ దేనికైనా దీనిని అమర్చుకోవచ్చు. మనం తిరిగే ప్రాంతంలో గాలిలో పర్టిక్యులేట్ మేటర్ (్ధళికణాలు-పిఎమ్2.5), నైట్రోజన్‌డైయాక్సైడ్, ఓజోన్, వొలాటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (విఒసీస్), ఉష్ణోగ్రత, తేమ ఏ మేరకు ఉన్నాయో ఆ పొల్యూషన్ ట్రాకర్ కనిపెట్టి ఆ సమాచారాన్ని స్మార్ట్ఫోన్‌కు చేరవేస్తుంది. నిజానికి ఆ పరికరానికి ఉండే టచ్‌బటన్‌ను నొక్కితే 12 రంగుల్లో కనిపించే ఎల్‌ఇడి సంకేతాలు మీకు అసలు విషయాన్ని తెలుపుతాయి. ప్రస్తుతం పరిశోధనలు పూర్తిచేసుకున్న ఈ పరికరం మార్కెట్‌లోకి త్వరలో రాబోతోంది. మనం ఈ పొల్యూషన్ ట్రాకర్‌ను కొనుగోలు చేసినప్పుడు వాతావరణ సూచనలకు సంబంధించి అంచనాల డేటాను ఆ సంస్థ సరఫరా చేస్తుంది. ఆ సంస్థకు సంబంధించిన యాప్‌ను ఉపయోగించుకుంటే ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ డివైజ్‌ను గదిలో పెట్టుకుంటే ఆ గది వాతావరణంలో వేడి, తేమ, కాలుష్యం వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంది కూడా. బిజీగా ఉండే నగరాల్లో రోగాలబారిన పడకుండా ఉండేందుకు ఈ ప్రొడక్ట్‌ను ప్లూమే లాబ్స్ అందుబాటులోకి తెచ్చింది. నిజానికి వాతావరణ కాలుష్యంపై పోరాటానికి, అప్రమత్తంగా ఉండటానికి ఎన్నో ప్రయోగాలు చేసి పలు స్మార్ట్ డివైజ్‌లను అందుబాటులోకి తెచ్చిన ఈ సంస్థ గతంలోనూ వినూత్న ఆవిష్కరణలకు ప్రాణం పోసింది. రెండేళ్లక్రితం గాలిలో కాలుష్య పరిమాణాన్ని అంచనా వేసేందుకు ఓ చిన్నపాటి స్మార్ట్ డివైజ్‌ను కనిపెట్టింది. వీటిని పావురాలవంటి శిక్షణ పొందిన పక్షుల వీపుపై అమర్చవచ్చు. అవి గాలిలో ఎగిరి కిందకి వచ్చాక ఆ ప్రాంతంలో వాతావరణంలో కాలుష్యం ఏ పరిమాణంలో ఉందో డేటా తెలుసుకునేవారు. అయితే ఇలాంటి పావురాలు అన్ని నగరాల్లో, అందరికీ అందుబాటులో ఉండవు. కనుక, వినియోగదారులకు అందుబాటులో ఉండే సరికొత్త ట్రాకర్‌ను ఇప్పుడు ప్లూమే రూపొందించింది. ఈ శీతాకాలం నాటికి ఇవి మార్కెట్‌లోకి వస్తాయని అంచనావేస్తున్నారు. *

చిత్రాలు...పావురానికి అమర్చిన స్మార్ట్ ట్రాకర్
* ప్లూమి పొల్యూషన్ ట్రాకర్