యువ

ఇది ‘కీ’ కాదు కానీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఆధునిక కాలంలో అంతా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ విస్తృతంగా వాడుతున్నారు. మొబైల్, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్స్, ఐపాడ్, ల్యాప్‌టాప్‌లాంటి వాడకంలో పెద్ద సమస్య బ్యాటరీ చార్జింగ్. ఎక్కువ సేపు బ్యాటరీ పనిచేస్తే పని సులువుగా ఉంటుంది. త్వరత్వరగా ఛార్జింగ్ అయిపోవడం వాటిని వినియోగింకునేవారికి పెద్దసమస్య. అందుకే చాలామంది తమ గాడ్జెట్స్‌తో పాటు రీఛార్జ్ మెటీరియల్‌ను, ఛార్జర్‌ను, బ్యాటరీ ప్యాక్‌ను తీసుకువెళుతూంటారు. ఇవి కాస్తపెద్దవి, చూడటానికి మొరటుగా కనిపిస్తాయి. స్థలాన్నీ ఆక్రమిస్తాయి. కేబుల్ అవసరమూ ఉంటుంది. ఇవేవీ లేకుండా ఓ కీచైన్ మాదిరిగా ఉండే పోర్టబుల్ కేబుల్ కీని నోమడ్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా యాపిల్ లైట్నింగ్ పోర్ట్, మైక్రో యుఎస్‌బి వెర్షన్‌ను ఆండ్రాయిడ్ సహా ఇతర గాడ్జెట్‌లకు పనికొచ్చేలా నోమడ్ కీ రూపొందింది.