యువ

‘అవతార్’ పిల్లలొచ్చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషిని పోలిన బొమ్మలు
కనీస ధర రూ. 1.7 లక్షలు
యువ వ్యాపారుల సృష్టి
ఈ బొమ్మలను చూడండి.. జాగ్రత్తగా.. ఆ మధ్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవతార్’ సినిమాలో పాత్రల రూపంలో కనిపిస్తున్నాయి కదూ.. కనిపించడమే కాదు చేతితో తాకినా నిజమైన పిల్లల మాదిరిగానే ఉంటాయ్. నిజానికి ఇవి సిలికాన్‌తో చేసిన బొమ్మలు. మరికాస్త జాగ్రత్తగా గమనించండి...ఆ పిల్లల తలవెనుకో, నడుముకో కరెంట్‌తో ఛార్జింగ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. విచిత్రమైన రూపంలో, విచిత్రమైన సౌకర్యాలతో నిజమైన చిన్నారుల మాదిరిగా కనిపించే ఈ బొమ్మలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయ్. వీటిని ‘రీబార్న్ బేబీ డాల్స్’గా పిలుస్తున్నారు. స్పెయిన్‌లో ఈమధ్యే జరిగిన ఓ ఎగ్జిబిషన్‌లో వీటిని ప్రదర్శించారు. అయితే ఈ బొమ్మలు ఖరీదు సామాన్యులకు అందుబాటులో ఉండదు. ‘స్పెయిన్’లో ఏటా నిర్వహించే ‘రీబార్న్’ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో వీటిని ప్రదర్శించారు. ఈ బొమ్మల కనీస ధర 1.7 లక్షలు. అదీ ‘అవతార్’ పాత్రలను పోలినవాటికన్నమాట. ప్రఖ్యాత బొమ్మల తయారీ సంస్థ ‘బిల్‌బావో’ బృందం వీటిని సృష్టించింది. ఈ తరహాలోనే ఒకమాదిరి బొమ్మల ధర 65 వేలుకూడా ఉంది. నిజానికి వీటిని చూసి ఎవరూ బొమ్మలనుకోరు. నిజమైన చిన్నారులుగానే భ్రమపడతారు.
యువ కళాకారుల సృష్టి
ఈ రియలిస్టిక్ బేబీ డాల్స్ సృష్టికర్త ఓ యువ కళాకారిణి. ఆమె పేరు క్రిస్టినా ఇగ్లేసియాస్. అచ్చం మనుషుల్లా ఉండే బొమ్మలను తయారుచేయడంలో వీరు దిట్ట. అలా బొమ్మలను తయారు చేసి విక్రయించేందుకు ఆమె బేబీక్లాన్ అనే సంస్థను ఏర్పాటు చేసుకుంది. ‘రీబార్న్’ బొమ్మల తయారు చేయడంలో ఈ సంస్థకు మంచి పేరుంది. స్పెయిన్ కేంద్రంగా క్రిస్టినా మరో పదిమందితో కలసి ఈ బొమ్మలను రూపొందిస్తారు. ప్లాస్టిసిన్, అల్యూమినియం, ఫ్యాబ్రిక్ మెటీరియల్, మరికొన్ని పదార్థాలను వినియోగిస్తారు. ఒక్కో బొమ్మ తయారీకి ముందు అసలు రూపం వచ్చేవరకు కనీసం వంద నమూనాలు తయారు చేస్తారు. మూడునెలలపాటు శ్రమపడితే ఒక బొమ్మ తయారవుతుంది. ఈ బృందంలో యువతులే ఎక్కువ. మా బొమ్మలకు మేమే అమ్మలం..కాకపోతే మా గర్భసంచీకి బదులు మా మనసులనుంచి వీరు పుట్టుకొస్తారంటారు వారు. వ్యాపారం కోసమే అయినా ప్రాణం ఉన్నట్లు బొమ్మలను తయారు చేయడం మాటలేం కాదు కదూ!