యువ

మాట్లాడండి.. నోట్ చేస్తుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజులు మారిపోయాయి. ఇంకా రాయడం, ఎవరికో ఒకరికి నోట్స్ చెప్పడం, మళ్లీ ప్రూఫ్ చూసుకోవడం ఏమిటి? ఆ అవసరం లేకుండానే... మీరు మాట్లాడితే రికార్డు చేసి, నోట్స్‌ను టెక్స్ట్ రూపంలోకి మార్చేసి, సమరైజ్ చేసిపెట్టే ఆధునిక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. డెస్క్‌టాప్‌పై ఆ డివైజ్‌ను పెట్టి మీరు చెప్పాల్సిన విషయాన్ని చెబితే చాలు అది మీ మాటల్ని రికార్డు చేస్తుంది. కొద్దిసెకన్లలో దానిని టెక్స్ట్ రూపంలోకి మార్చి, అవసరమైన గ్రామర్ మార్పుల్ని చేసి సమ్మరైజ్డ్ టెక్స్ట్‌ను స్క్రీన్‌మీద ప్రత్యక్షం చేస్తుంది. దానిని చూసి మీరు చేయాల్సిన మార్పులుంటే కూడా నోటితే చెపితేచాలు. ఇదంతా ఓ యాప్‌తో సౌకర్యంతో పనిచేస్తుంది. ఈ డివైజ్ చూడటానికి కూడా ముచ్చటగా ఉంటుంది. ‘టైటాన్ నోట్’ అన్న డివైజ్‌తో ఇదంతా వీలవుతోంది. ఈ డివైజ్‌ను ఎదురుగా పెట్టుకుని ఓ బటన్ నొక్కి మీరు మాట్లాడటం మొదలెడితే మిగతా పని అది పూర్తి చేస్తుందన్నమాట.