యువ

కష్టంతో కాదు, ఇష్టంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ పని చేయాలన్నా ఉసూరుమంటూ ప్రారంభిస్తే అది ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు, దాంతో ఎవరైనా సరే మరింత నిరుత్సాహానికి గురై బద్దకం మొదలవుతుంది. ‘తర్వాత చేద్దాంలే’ అనే భావనతో పనులు ఎప్పటికపుడు వాయిదా పడుతుంటాయి. పనులు వాయిదా పడితే ఇంకేముంది? జీవితంలో ఉల్లాసం తగ్గి నిర్వేదం మొదలవుతుంది. అలాంటి వ్యక్తులు సమాజానికి పెద్ద భారంగా మారే ప్రమాదం ఏర్పడుతుంది. స్ర్తి, పురుషులే కానక్కర్లేదు, ఈ మధ్య చదువుల్లోనే కాదు, ఉద్యోగాల్లోనూ రానిస్తున్న థర్టు జండర్ కావచ్చు. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి, లక్ష్య సాధనకు ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళికకో కార్యాచరణ కావాలి. ఆ ప్రణాళిక ఆర్థిక అంశాలకు సంబంధించింది కావచ్చు, పరిస్థితులకు సంబంధించింది కావచ్చు. స్నేహితులు, ఇతర కుటుంబ సంబంధమైనదే కావచ్చు లేదా విషయానుగతమైన సమాచార సేకరణకు సంబంధించింది కావచ్చు. ఏదైనా ముందుగా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి. అపుడే అడుగులు ముందుకు పడతాయి. ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలంటే ఎపుడూ ఉన్నత భావాలకు ప్రభావితులు కావాలి, దూరదృష్టితో పరిస్థితులను అవగతం చేసుకుంటూ వడివడిగా జీవితంలో ముందడుగు వేసే తత్వాన్ని అర్థం చేసుకున్నపుడే వారు ఏదైనా సాధించేందుకు సిద్ధం కాగలుగుతారు.
మార్చి నుండి జూన్ వరకూ చూస్తే వివిధ పరీక్షల ఫలితాలు వెలువడటం, పోటీ పరీక్షలు, ఎంపిక పరీక్షల్లో విజేతలను చూసినపుడు అందరిలో ఏకరూప లక్షణం ఒక్కటే- ఏ పనిచేసినా కష్టపడి కాకుండా ఇష్టపడి చేయడం. ఇష్టపడి చేయడంలోనే నిజానికి చాలా కష్టం ఉంటుంది. తాము చేసే పనిని ఏదో అదనపు భారంగా భావించకుండా, ఒక లక్ష్యాన్ని సాధించాలనే తపన, ఆనందం, ఉత్సాహంతో ముందుకు సాగినపుడు పనిలో కష్టం కనిపించదు, ఇష్టం మాత్రమే కనిపిస్తుంది.
దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం ఎపుడూ చెప్పినట్లు- పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించాలనే కలలు నిరంతరం కనాలి, ఆ కలలు సాఫల్యం కావడానికి నిరంతరం కృషి చేయాలి. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ’ (ఎయిమ్స్) ప్రవేశపరీక్షలో టాపర్‌గా నిలిచిన సూరత్ బాలిక నిషిత పురోహిత్ చెప్పేది ఇదే. నూటికి నూరు మార్కులు సాధించడం.. అదీ ఎయిమ్స్ లాంటి అతి పెద్ద పోటీ పరీక్షల్లో ఆ ఘన విజయాన్ని నమోదు చేసుకోవడం మాటలు కాదు. అయితే తాను ఈ విజయం సాధించడం వెనుక నిరంతరం ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులు, మార్గదర్శనం చేసిన శిక్షణ సంస్థ నిపుణులు ఉన్నారని ఆమె చెబుతోంది. ‘రెండేళ్లు అన్నీ మరిచిపోయి విజయం కోసం కృషి చేసి అనుకున్నది సాధించాను’ అని నిషిత అంటోంది. ‘సామాజిక మాధ్యమాలే కాదు, ఉల్లాసాన్నిచ్చే టీవీ కార్యక్రమాలు, సినిమాలకు దూరంగా ఉండిపోయాను. నా కళ్ల ముందు కనిపించే లక్ష్యాన్ని సాధించాలనే తపనే నన్ను ఆ దిశగా నడిపించింది’ అంటోంది. ‘ఎయిమ్స్ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు సాధించాలనకున్న తర్వాత ఆటలకు కూడా దూరంగా ఉండిపోయాను, జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారిణిగా గుర్తింపు లభించినా, నా తక్షణ కర్తవ్యం ఎయిమ్స్ సాధించడం అందుకే సమయం అంతా విషయానుగతమైన అనుమానాలను నివృత్తి చేసుకోవడం, టీచర్లతో చర్చించి పరీక్షకు సిద్ధం కావడంతోనే గడిపేశాను. అంత మాత్రాన జీవితాన్ని కట్టేసుకున్నట్టు కాదు’ అని ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తోంది. లక్ష్యాన్ని సాధించే తపనను పెంచుకోవడమే, ఒక విజయం సాధించడానికి చేసే కృషిలోనూ, విజయం అనంతరం పొందే ఆనందంలోనూ ఉన్న తృప్తి ఇంకెందులోనూ ఉండదని అంటోంది నిషిత.

చిత్రం.. ఎయమ్స్ టాపర్ నిషిత పురోహిత్

-బి. వాగ్దేవి