యువ

స్కేటింగ్‌లో భారత ’భవిత’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కేటింగ్ క్రీడలో ఇప్పుడిప్పుడే భారత్ వెలుగులీనుతోంది. చైనాలో నిర్వహించబోయే వరల్డ్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత్ తరపున ఎంపికైన ఇద్దరు స్కేటింగ్ క్రీడాకారులే అందుకు ఉదాహరణ. గుజరాత్‌కు చెందిన మిస్రీ పారిఖ్‌తోపాటు యువ సంచలన స్కేటర్ భవిత మధు ఈ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫిగర్ స్కేటింగ్ విభాగంలో భవిత పోటీ పడుతూండగా ఏదో ఒక పతకం సాధిస్తున్న విశ్వాసం ఆయా వర్గాల్లో వినిపిస్తోంది. ‘వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో పతకం గెలుచుకోవడం నా కల. పతకం సాధించడం కష్టమైన పనే అయినా ఈ పోటీల్లో తగిన ప్రతిభ చూపిస్తానన్న విశ్వాసం నాకుంది. నాకు తోడుగా మిస్రీ ఉండటం గొప్ప విషయం. గతంలో ఆమె ఈ పోటీల్లో పాల్గొన్న అనుభవంతో ఇస్తున్న సలహాలు నాకు ఎంతో విలువైనవి. తొలిసారిగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న ఒత్తిడి ఉన్నా మిస్రీ వల్ల తేరుకుంటున్నా. ఆమెతో కలసి ప్రాక్టీస్ చేస్తున్నా’ అని భవిత అంటోంది. ఏసియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్-2015 జూనియర్ విభాగంలో భవిత రజత పతకాన్ని సాధించింది. అంతకుముందు సంవత్సరం భవిత కేడెట్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది.
ఐదేళ్ల వయసులోనే ఆట మొదలు..
భారత స్కేటింగ్ విభాగంలో ఆశారేఖగా భావిస్తున్న భవిత తనగురించి వివరాలు, అభిప్రాయాలు పంచుకుంది. ‘నా చిన్నతనంలోనే స్కేటింగ్ అంటే ఆసక్తి ఏర్పడింది, ఐదో ఏట ఖాళీ సమయంలో సరదాగా స్కేటింగ్ చేసినప్పటికీ ఆ తరువాత అదే లోకమైంది. వివిధ కేటగిరీల్లో సాధన చేశా. భారతదేశం తరపున జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించా. పదిహేనేళ్ల వయసులో తొలిసారిగా మహిళల జూనియర్ స్కేటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించడం గొప్పగా భావిస్తా. నా శిక్షకురాలు జ్యోతిక దేశాయ్ వల్లే ఇది సాధ్యమైంది. గుజరాత్ ప్రభుత్వం అండదండలతో స్కేటింగ్‌లో రాణిస్తున్నా. ఈ క్రీడ ఖర్చుతో కూడుకున్నది. నిజానికి అహ్మదాబాద్‌లో ‘స్కేటింగ్ రింక్’ లేదు. విదేశాల్లో ఇవి బ్రహ్మాండంగా ఉంటాయి. కలపతో చేసిన ఫ్లోరింగ్‌తో చేసిన స్కేటింగ్ రింక్‌లను ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
చదువును నిర్లక్ష్యం చేయలేదు..
‘స్కేటింగ్ ప్రాక్టీస్, పోటీల్లో పాల్గొంటూ చదువుకోవడం కష్టంగానే ఉంది. కానీ చదువును నిర్లక్ష్యం చేయలేదు. సిబిఎస్‌సి టెన్త్ పరీక్షల్లో 91శాతం మార్కులు, 9.6 సిజిపిఎ సాధించా. ప్రతిరోజూ సాయంత్రం మూడు గంటలపాటు స్కేటింగ్‌లో అభ్యాసం చేస్తా. భవిష్యత్‌లో బయోకెమిస్ట్రీలో ప్రొఫెసర్‌గా రాణించాలన్నది నా లక్ష్యం. మరీ ఒత్తిడికి లోనైతే బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి ఆటలు ఆడతా, లేదంటే స్నేహితులతో కబుర్లు చెబుతా. వారంతే సోషల్ మీడియాలో మునిగిపోతూంటారు కానీ నాకు దానిపై పెద్ద ఆసక్తి లేదు’ అంటోంది భవిత.

- రవళి