యువ

‘విశ్వసుందరి’ కిరీటమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విశ్వసుందరి’గా కీర్తికిరీటం సాధించడమే తన జీవిత లక్ష్యమని అంటోంది హర్యానాకు చెందిన మానుషి ఛిల్లార్. ఇటీవల జరిగిన ఎఫ్‌బిబి కలర్స్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2017 పోటీల్లో ఆమె విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ పోటీ అయిన ‘మిస్ వరల్డ్’పై దృష్టిపెట్టింది. చైనాలో ఈ ఏడాది చివరిలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. 1966లో విశ్వసుందరి కిరీటాన్ని పొందిన తొలి ఆసియా మహిళగా, తొలి భారతీయురాలిగా సంచలనం సృష్టించిన రీటా ఫరియా తనకు స్ఫూర్తిదాత అని మానుషి చెబుతోంది. నిజానికి ఇప్పుడు జరిగిన పోటీల కోసం మానుషి తన విద్యాసంవత్సరాన్ని త్యాగం చేసింది. వైద్యవిద్య అభ్యసిస్తున్న ఆమె ‘ఎఫ్‌బిబి కలర్స్ ఫెమినా మిస్ ఇండియా-2017’ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎట్టకేలకు టైటిల్ సాధించింది. ‘చిన్నప్పటి నుంచి నాకు రీటానే ఆరాధ్య దేవత. ఆమెను చూసినప్పుడల్లా స్ఫూర్తిపొందేదాన్ని. ఆమె విశ్వసుందరిగా ఎంపికైన తరువాత ఆ బాధ్యతలు నిర్వర్తించిన వెంటనే తన అసలు వృత్తి అయిన వైద్యరంగానికి వెళ్లి సేవలందించారు. గ్లామర్ ప్రపంచంలో ఎన్నో అవకాశాలు వచ్చినా ఆమె వైద్యవృత్తినే కొనసాగించారు. ఆమె నిజమైన వ్యక్తి అని నా భావన’ అని అంటోంది మానుషి. కాగా, జమ్ము కశ్మీర్‌కు చెందిన సన దువ ఈ పోటీల్లో తొలి రన్నరప్‌గా, బిహార్‌కు చెందిన ప్రియాంక కుమారి రెండవ రన్నరప్‌గా నిలిచారు. రోజువారీ వ్యాయామం, ప్రశ్నలు జవాబుల సెషన్ వంటి కార్యక్రమాలతో బిజీగా గడిపిన ఆమె ఈ పోటీలో గెలవడానికి ఎంతో శ్రమించానని చెబుతోంది. న్యూఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్‌లో ప్రాథమిక విద్య, సోనేపేట్‌లోని మెడికల్ కళాశాలలో వైద్యవిద్య చదివిన మానుషికి నృత్యం, చిత్రలేఖనం, గాత్రం, పద్యరచన అంటే ఇష్టం. ఈసారి ఎఫ్‌బిబి కలర్స్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ విజేతగా నిలవడంతోపాటు ఎఫ్‌బిబి కేంపస్ ప్రినె్సస్ 2017 ఫైనలిస్ట్‌గా, మిస్ పొటొజెనిక్‌గాకూడా నిలిచింది. ‘విశ్వాసంతో మనం కనే కలలను సాకారం చేసుకోవాలి, అందుకు హద్దులే లేవ’ని అంటోది మానుషి.

చిత్రం.. మానుషి ఛిల్లార్

- రవళి