యువ

కోరుకున్న కెరీర్‌కు కోటి దారులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జీవితం ఎవర్నీ వదలదు, అది అందరి సరదా తీర్చేస్తాది..’ ఇది ఓ సినిమాలో పంచ్ డైలాగ్. అవును జీవితం కోసం మనం మారకపోతే- అందరి సరదా అది తీర్చేయడం ఖాయం. అందుకే రమణ మహర్షి చెప్పినట్టు కాలంతో పాటు కలసి ముందుకు వెళ్లాల్సిందే. ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన ఓ చిత్రంలో- ‘ఎన్ని సమస్యలు రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసినా’ తనేం చేయాలో తెలిసిన క్లారిటీ ఆయనకే కాదు, ఎవరికైనా అవసరం. ప్రపంచం అవకాశాల పుట్ట. ప్రతి మనిషీ తనకు ఏ రంగంపై ఆసక్తి ఉందో, ఎందుకు ఉందో, అది ఎంతకాలం ఉంటుందో ముందుగానే క్లారిటీ ఉండాలి. అపుడు తనకు ఆసక్తి ఉన్న రంగంపై దృష్టి సారించాలి. చదువుకునే యువతకు వారు ‘చదువుకునేంత విశాలంగా’ లోకం అందుబాటులో ఉంది. వివిధ రంగాలకు చెందిన అనేక అంశాలపై నిష్ణాతులయ్యేందుకు రకరకాల కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇటు ప్రభుత్వ రంగంలోనూ, అటు ప్రైవేటు రంగంలోనూ మంచి కెరీర్‌కు ఇపుడు అవకాశాలు పుష్కలం. వ్యవసాయం, వ్యాపారం, వస్తు ఉత్పత్తి, సేవలు, బ్యాంకింగ్, రవాణా, ఆరోగ్య రంగం, విద్య, ఇతర రంగాలతో పాటు స్వయం ఉపాధికి ఎన్నో అవకాశాలున్నాయి. ఉపాధి అంటే మనిషి తన జీవన అవసరాలకు ఎంచుకున్న ఆదాయ మార్గం. దీనిని అనేక రకాలుగా నిర్వచించవచ్చు లేదా వర్గీకరించవచ్చు. ఉపాధి లేకపోతే దానిని మనం నిరుద్యోగంగా చూస్తాం. యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. వాటిని ఉపయోగించుకుంటూనే మరో పక్క అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఉన్నత చదువులంటే కేవలం ఐఐటిలో సీటు సంపాదించడమే కాదు. వైద్యవిద్య అభ్యసించడం కాదు. మంచి కెరీర్‌కు దోహదపడే ఎన్నో వృత్తివిద్య కోర్సులు నేడు యువతకు అందుబాటులో ఉన్నాయి. ఫలానా కోర్సు చదవాలని యువతపై తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తే ఆశించిన ఫలితం ఉండదు. యువత ఆసక్తి, అభిరుచి మేరకు కెరీర్‌ను ఎంచుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులు కల్పించాలి.
చేతివృత్తుల కోర్సులు, భవన నిర్మాణ రంగం, ఎలక్ట్రికల్ విభాగం, తక్కువ స్థాయి విద్యార్హతలున్న వారికి రాడ్ బెండింగ్, ప్లంబింగ్ వంటి కోర్సుల్లో శిక్షణ అందుబాటులోకి వచ్చింది. మరో పక్క కేంద్ర ప్రభుత్వం నైపుణ్య వృద్ధి పథకాన్ని అమలుచేస్తోంది. 46 రంగాల్లో 1090 మాడ్యులర్ ఎంప్లాయిబల్ స్కిల్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ కావడంతో ప్రైవేటు రంగంలో కూడా శిక్షణ, సర్ట్ఫికేషన్ అందుబాటులోకి వచ్చాయి. నియత విద్యారంగంలో విద్యావ్యాసంగం ఆధునిక సాంకేతికాలకు అనుగుణంగా ఉండకపోవడం, సంస్థలకు ఆధునిక సాంకేతికాంశాల్లో శిక్షణ పొందిన అభ్యర్ధులు అవసరమవడంతో చాలా మంది ప్లస్ టు తర్వాత డిప్లొమో లేదా డిగ్రీ తర్వాత కంప్యూటర్ కోర్సులు చేసి ఉపాధి పొందగలుగుతున్నారు. మన దేశంలో ఎన్‌ఐఐటి, ఆప్టెక్, సిఎంఎస్ లాంటి సంస్థలు వీటిని మొదటగా ప్రారంభించగా, ఆ తర్వాత చాలా సంస్థలు వివిధ రకాల కోర్సులు అందుబాటులోకి తెచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థ సిడాక్ కూడా కోర్సులను ఇంజనీరింగ్ విద్యార్ధులకు ప్రత్యేకంగా అధీకృత సంస్థల ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సుల కాలపరిమితి మూడు నెలల నుండి ఏడాది కాలం ఉంటోంది. ఇలా చెప్పుకుంటూ పోతే అవకాశాలు అనంతం. శతకోటి ఆలోచనలకు, అనంతకోటి అవకాశాలు.

- బివి ప్రసాద్