యువ

మెరిసిన ‘మెహర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ స్థాయి నైపుణ్య శిబిరంలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తానని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది హైదరాబాద్‌కు చెందిన మెహర్ రిషిక. అబు దాబిలో త్వరలో జరిగే ‘వరల్డ్ స్కిల్స్ ఈవెంట్- 2017’లో మన దేశం తరఫున పాల్గొంటున్న ఏకైక ప్రతినిధిగా ఆమె ఇప్పటికే సంచలనం సృష్టించింది. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డిసి) ఇటీవల నిర్వహించిన ‘ఇండియా స్కిల్స్ కాంపిటేషన్- 2017’లో పాల్గొన్న రిషిక ప్రథమ స్థానంలో నిలిచింది. ‘ఐటి రంగంలో వ్యాపార నైపుణ్యాల’కు సంబంధించి జరిగిన ఈ పోటీలో ప్రథమస్థానంలో నిలిచినందుకు కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ నుంచి అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని ఆమె అందుకుంది. దేశ రాజధాని దిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీకి వివిధ రాష్ట్రాల నుంచి 379 మంది విద్యార్థులు హాజరయ్యారు. మూడు స్థాయిల్లో జరిగిన ఈ జాతీయ పోటీలో రిషిక ప్రథమురాలిగా నిలిచింది. దీంతో ఆమెను ‘ఐటిఎస్‌ఎస్‌బి కేటగిరీ’లో అబు దాబీలో జరిగే ‘వరల్డ్ స్కిల్స్- 2017’ పోటీకి ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లోని బివిఆర్ ఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్న రిషిక ఐఐఎంలో సీటు సంపాదించడమే తన లక్ష్యమంటోంది. మానసిక ఒత్తిడులను అధిగమించేందుకు ఇలాంటి పోటీలు యువతకు అవసరమని ఆమె చెబుతోంది. అబు దాబిలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో మన దేశానికి పతకం సాధించి పెడతానని రిషిక ధీమా వ్యక్తం చేస్తోంది.