యువ

‘ప్రాబ్లమ్ బోలో’తో ఇక నిశ్చింత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేరుకున్న చెత్తకుప్పలు, పాడైన రహదారులు, వెలగని వీధిదీపాలు, పనిచేయని నల్లాలు, పూడుకుపోయిన డ్రైనేజీ... ఇలాంటి సమస్యలతో అనునిత్యం ఇబ్బందిపడేవారిని చేతనైనంత మేర ఆదుకోవాలని ఆ విద్యార్థులు సంకల్పించారు. నగరాల్లో పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వారు ఓ వినూత్న ‘యాప్’ను రూపొందించారు. పౌర సమస్యల పరిష్కారానికి దోహదపడే ఈ ‘యాప్’కు వారు ‘ప్రాబ్లమ్ బోలో’ అని పేరు పెట్టారు. హైదరాబాద్‌లోని ఆగాఖాన్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతున్న సాత్విక్ యడవల్లి, జెహెరా ఖాద్రి, అలీరాయ్, జియాన్ బుద్వాని, ఆశ్రీత్ కృష్ణ, అంజలీకుమార్ సమాజానికి మేలు చేయాలన్న దిశగా ఆలోచించి ఈ ‘యాప్’ను రూపొందించారు. ‘యువ ఎంటర్‌ప్రెన్యూర్స్’ నేతృత్వంలోని ‘టెక్నోఫైల్’ సంస్థ ఈ ‘యాప్’ను అందుబాటులోకి తెస్తోంది. పౌర సమస్యల పరిష్కారం దిశగా తొలిసారి రూపొందిన ఈ ‘యాప్’ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులో ఉంటుంది. నగరాల్లో పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు ఈ యాప్‌ను తీర్చిదిద్దినట్లు యువ ఎంటర్‌ప్రెన్యూర్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సాత్విక్ యడవల్లి చెబుతున్నారు. తనతోపాటు ఆరుగురు యువ ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో భాగస్వామ్యం వహిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్, వాటర్ వర్క్స్, విద్యుత్ తదితర శాఖలకు సంబంధించిన సమస్యలను పౌరులెవరైనా తమకు తెలియజేస్తే- ఫొటోతో పాటు పూర్తి వివరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా ‘ప్రాబ్లమ్ బోలో’ యాప్‌ను విడుదల చేసి, రెండేళ్ల కాలవ్యవధిలో కనీసం 500 పట్టణాలు, నగరాల్లో సేవలు అందించాలని యువ ఎంటర్‌ప్రెన్యూర్స్ సంస్థ భావిస్తోంది. హైదరాబాద్‌లోని ట్రాన్స్‌కో, వాటర్ వర్క్స్, జిహెచ్‌ఎంసి వంటి సంస్థలతో అనుసంధానం కోసం ఈ సంస్థ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ‘యాప్’ తయారీకి ‘టెక్నోఫైల్’ సంస్థ ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ యాప్ వినియోగంపై విదేశాల్లోనూ ఆసక్తి చూపుతున్నారని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ‘యాప్’ సృష్టికర్తలకు నిధులు సమకూర్చేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు.

చిత్రం.. యాప్‌ను రూపొందించిన ఆగాఖాన్ అకాడమీ విద్యార్థులు