యువ

హైపర్ గ్లాస్... సూపర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ ఫోన్ల స్క్రీన్‌కు రక్షణ కల్పించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఐఫోన్‌లకోసం తాజాగా మార్కెట్లోకి వచ్చిన హైపర్ గ్లాస్ ఇప్పుడో తాజా సంచలనం. ఇంపోర్టెడ్ జపనీస్ గ్లాస్‌తో హై టెక్నాలజీని వినియోగించి రూపొందించిన ఈ హైపర్ గ్లాస్ కేవలం స్క్రీన్ ప్రొటెక్టర్ మాత్రమే కాదు...హైటెక్ సెక్యూరిటీకి కేరాఫ్ అడ్రస్. ఐ ఫోన్ 6 హోమ్ బటన్‌కు ఇరువైపులా హైపర్ గ్లాస్ రెండు టచ్ పాయింట్లను ఇస్తోంది. ఇవి కంటికి కనపడవు. వీటిని ప్రెస్ చేస్తే ఫోన్ పై భాగంలోని కుడి లేదా ఎడమ కార్నర్లకు ఎలక్ట్రిక్ కరెంటు పాస్ అయి, పై భాగంలో ఉన్న బటన్స్‌ను ఆన్ చేయడం, ఆఫ్ చేయడం చేస్తాయి. అంటే... ఫోన్ పై భాగంలో ఉన్న బటన్స్‌ను ఆపరేట్ చేయాలంటే ఇకపై ఫోన్‌ను మరో చేతిలోకి తీసుకుని, పైభాగంలోకి వేళ్లను జరిపి బటన్స్‌ను ప్రెస్ చేసే ప్రయాస ఉండదన్నమాట.