యువ

రోబో సైనికుడు రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినోదం కోసమో, వికాసం కోసమో కాదు.. దేశ సరిహద్దుల్లో సైనికులకు ఉపయోగపడే అద్భుత రోబోను రూపొందించి ఓ ఇంటర్ కుర్రాడు అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు. ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతంగానే గుర్తింపు పొందిన ఒడిశాకు చెందిన నీల్మాధబ్ తలానగర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ తన మేధస్సుకు పదును పెట్టి ఈ అద్భుతాన్ని సాధించాడు. నిత్యం ఏదో ఆలోచిస్తూ, అందరిలోనూ ప్రత్యేకతను సాధించాలని పరితపించే నీల్మాధబ్ వినూత్న రోబోను ఆవిష్కరించేందుకు ఏడాది కాలంగా శ్రమపడ్డాడు. సుమారు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి, 4.7 అడుగుల ఎత్తు, 30 కిలోల బరువుండే రోబోను తయారు చేశాడు. పధ్నాలుగు సెన్సర్లు, అయిదు రిమోట్ కంట్రోల్ వ్యవస్థలతో ఇది పని చేస్తుంది. పదిహేడేళ్ల నీల్మాధబ్ సైనికుల కోసం సృష్టించిన రోబోను చూసి మేధావులు సైతం ‘ఔరా’ అంటున్నారు.
‘ఆర్ట్ఫిషియల్ అల్గారిథం’ ఆధారంగా తయారైన ఈ హ్యూమనాయిడ్ రోబోకు ‘ఆటమ్ 3.7’ అని నీల్మాధబ్ నామకరణం చేశాడు. దేశ సరిహద్దులో ఇది సైనికుడి మాదిరి పనిచేస్తుంది. వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ మాన్యుఫాక్చరింగ్, డొమస్టిక్ సేవలను సైతం మనకు ఇస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే బొమ్మలంటే ఈ కుర్రాడికి చిన్నతనం నుంచి ఎనలేని ఆసక్తి. మూడో తరగతి చదువుతున్నపుడే సైన్స్ ఎగ్జిబిషన్లకు వెళుతూ చిన్న చిన్న ప్రాజెక్టులను ప్రదర్శించిన నీల్మాధబ్ ఎప్పటికైనా రోబోలను సృష్టించాలని భావించాడు. సైన్స్ ప్రాజెక్టులు, రోబోలంటూ డబ్బును, కాలాన్ని ఖర్చు చేస్తున్న ఈ కుర్రాడిని చూసి తండ్రి కూడా మొదట్లో కొంత ఆందోళన చెందాడు. బుద్ధిగా చదువుకోకుండా ఈ ప్రయోగాలు ఎందుకంటూ విసుక్కున్నాడు. అయితే, ఆ తర్వాత తన కుమారుడిలో దాగిఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. తాను మరింతగా రాణించాలంటే రోబోటిక్స్ రంగంలో ఉన్నత చదువులు పూర్తి చేయాలని నీల్మాధబ్ భావిస్తున్నాడు. తండ్రి అండగా నిలవడంతో ఆకాశమే హద్దుకు దూసుకుపోతున్నాడు. ఇంటర్నెట్‌లో తనకు అవసరమైన విషయాలపై సమాచారాన్ని శోధిస్తూ వినూత్న ఆవిష్కరణల దిశగా కృషి చేస్తున్నాడు. దేశ సరిహద్దులో సైనికుడి మాదిరి కాపలా కాసే రోబోను సృష్టించినందుకు నీల్మాధబ్‌ను సహచర విద్యార్థులు, అధ్యాపకులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వివిధ రంగాల్లో అవసరమయ్యే రోబోలను, డోన్లను రూపొందించాలన్నదే తన లక్ష్యమని ఈ కుర్రాడు తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నాడు.