యువ

అందరి చూపూ ‘సైబర్ సెక్యూరిటీ’ పైనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతికత ఎంతగా విజృంభిస్తోందో.. దాన్ని ఆధారంగా చేసుకొని నేరాలకు పాల్పడేవారి సంఖ్య కూడా అదే రీతిలో పెరుగుతోంది. గ్రామసీమల్లో సైతం నగదు రహిత లావాదేవీలు పెరగడంతో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం ఎక్కువవుతోంది. కంప్యూటర్లలో మనం నిక్షిప్తం చేసుకొనే సమాచారానికి రానురానూ భద్రత కరవవుతోంది. కేవలం వ్యక్తులకు సంబంధించే కాదు, బ్యాంకులు, ఆర్థిక, వ్యాపార సంస్థలకు సైతం సైబర్ భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. విశ్వవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఈ మధ్య గడగడలాడించిన ర్యాన్‌సమ్ వేర్, వానాక్రై వైరసి వంటి వైపరీత్యాలు ‘సైబర్ సెక్యూరిటీ’ అవసరాన్ని మరింతగా గుర్తు చేస్తున్నాయి. దీంతో సైబర్ నేరాలను పసిగట్టే నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో కేవలం ఏడాది కాలంలో సుమారు వెయ్యి సైబర్ నేరాలు నమోదయ్యాయి. ‘సాఫ్ట్‌వేర్’ మోసగాళ్ల సంఖ్య దినదినాభివృద్ధి చెందడంతో వారి ఆటకట్టించేందుకు పోలీసు శాఖలో ప్రత్యేకంగా ‘సైబర్ క్రైమ్’ విభాగాలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
బ్యాంకులు, ఆర్థిక, వ్యాపార, వాణిజ్య సంస్థలకు సంబంధించిన కంప్యూటర్ నెట్‌వర్క్, డేటా, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, సైబర్ స్పేస్‌కు ప్రమాదం ఏర్పడడం, డేటా తస్కరణ వంటి పరిణామాలు నిత్యకృత్యంగా మారాయి. మరోవైపు ‘ఆన్‌లైన్’లోనూ ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఈ రకమైన నేరాలను అదుపు చేయాలంటే అందుకు అవసరమైన ప్రోగ్రామ్‌లు, అప్లికేషన్లకు రూపకల్పన జరగాలి. ఇదంతా సైబర్ సెక్యూరిటీలో భాగమే.
డేటా భద్రతకు బ్యాంకులు, వాణిజ్య, ఆర్థిక సంస్థలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ కోర్సు చదివిన వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇప్పటికే ప్రముఖ ఐటి సంస్థల్లో పనిచేస్తున్న టెకీలు సైతం ఇప్పుడు ‘సైబర్ సెక్యూరిటీ’ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. ఈ కోర్సులు పూర్తి చేసినవారికి ఐటి కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి. మంచి జీతభత్యాలు లభించే అవకాశం ఉన్నందున సైబర్ సెక్యూరిటీ కోర్సులపై యువత మోజు పడుతోంది. బిటెక్, ఎంటెక్ చదివినప్పటికీ సైబర్ సెక్యూరిటీ కోర్సు చదవితే అదనపు అర్హతగా భావిస్తున్నారు.
రెండేళ్ల పీజీ కోర్సు..
సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యత పెరగడంతో హైదరాబాద్‌లోని జెఎన్‌టియులో ఈ ఏడాది రెండేళ్ల పీజీ కోర్సును కొత్తగా ప్రారంభించారు. ‘సైబర్ ఫోరెన్సిక్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ’ పేరుతో ప్రారంభించిన ఈ కోర్సులో ప్రవేశానికి బిటెక్ పూర్తి చేసినవారు అర్హులు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి వివిధ అంశాలు ఈ కోర్సులో ఉంటాయి. మరోవైపు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు పోలీసు శాఖ కూడా విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. సినిమా థియేటర్లు, సోషల్ మీడియా, టీవీ చానళ్లు, పత్రికల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కలిగిస్తున్నారు. జెఎన్‌టియు, నాస్‌కామ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ వంటి సంస్థలు నిపుణుల సహాయంతో సైబర్ నేరాల నివారణకు కృషి జరుగుతోంది. ఇంజనీరింగ్ కళాశాలలు, ఐటి సంస్థల్లో ఈ అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తూ సైబర్ సెక్యూరిటీపై సమాచారాన్ని అందజేస్తున్నారు.