యువ

‘గోల్’ పైనే దృష్టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్నటి వరకూ అల్లరి చిల్లరగా తిరుగుతూ, ఎలాంటి దిశానిర్దేశం లేక కాలక్షేపం చేసిన కుర్రకారు ఇపుడు ‘్ఫట్‌బాల్’ క్రీడలోనే కాదు.. జీవితంలోనూ ‘గోల్’ సాధించాలని పరితపిస్తున్నారు. ‘గోల్’ కొట్టాలన్న ఆరాటమే కాదు.. అందుకు తగిన సాధన చేస్తూ అందరి చేత ‘్భష్’ అనిపించుకుంటున్నారు. ఉగ్రవాదం సమస్యతో శాంతిభద్రతలు కరవైన జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో చాలామంది యువకులు సైనికులపై రాళ్లు విసురుతూ భద్రతా బలగాలను ఇబ్బంది పెట్టేవారు. ఇలాంటి యువకుల్లో మార్పు తెచ్చేందుకు ఖుద్సియా అల్త్ఫా అనే 23 ఏళ్ల యువతి సంకల్పించింది. పాటియాలాలోని జాతీయ క్రీడాసంస్థలో ఫుట్‌బాల్ కోచ్‌గా శిక్షణ పొందిన ఆమె ప్రస్తుతం పదిమంది కుర్రాళ్లకు తర్ఫీదు ఇస్తోంది. కాశ్మీర్ యూనివర్సిటీ మైదానంలో ప్రతిరోజూ సాయంత్రం మూడు గంటల సేపు ఆమె ఫుట్‌బాల్‌లో మెళకువలు నేర్పుతోంది. సివిల్ ఇంజనీరింగ్ చదువుకు మధ్యలో స్వస్తి పలికిన అల్త్ఫా ఫుట్‌బాల్ కోచ్‌గా శిక్షణ తీసుకుంది. 2007 నుంచి ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడుతున్నా ఆమె ఇంతవరకూ జాతీయ స్థాయి పోటీలకు హాజరుకాలేదు. ప్రస్తుతం తన వద్ద శిక్షణ పొందుతున్న యువకులు అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీల్లో ఆడాలన్నదే తన లక్ష్యమని ఆమె చెబుతోంది. డ్రగ్స్, ధూమపానం, విధ్వంసక చర్యలకు అలవాటు పడుతున్న యువతను చైతన్యపరచి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చాలన్నదే తన తపన అంటోంది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేయాలని భావిస్తున్న ఆమెను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఫుట్‌బాల్ కోచ్‌గా నియమించింది. జీతం తక్కువే అయినప్పటికీ యువతను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో ఎంతో సంతృప్తి ఉందని ఆమె చెబుతోంది.