యువ

‘తరంగాల’తో మెదడుకు చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతిలో పుస్తకం ఉన్నా లేకున్నా, నేటి కుర్రకారుకు సెల్‌ఫోనే అత్యంత ప్రధానం. అధునాతన స్మార్ట్ఫోన్లు వాడుతూ సామాజిక మీడియాలో కాలక్షేపం చేయడమే యువతలో చాలామందికి ముఖ్య వ్యాపకం అయింది. సెల్‌ఫోన్ ఎందుకు వాడుతున్నారనే విషయాన్ని పక్కన పెడితే, అదే పనిగా గంటల తరబడి ఫోన్లను వాడేవారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్‌ఫోన్ల ద్వారా ‘మైక్రోవేవ్స్’ (సూక్ష్మ తరంగాలు) మన శరీరంలోకి సులువుగా చొచ్చుకుపోతాయి. శరీరంలో ప్రయాణించే ఈ మైక్రోవేవ్స్ ద్వారా కణజాలంలో అవాంఛనీయ మార్పులు తప్పవు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిలో మెదడుపై ఈ తరంగాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. మైక్రోవేవ్స్ వల్ల మెదడు కణజాలం క్రమేపీ దెబ్బతింటుందని నిపుణులు ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేస్తూ హెచ్చరిస్తున్నారు. గేమ్స్, టీవీ షోల కోసం ఫోన్లను వినియోగించేవారికి ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు. సెల్‌ఫోన్ ద్వారా వచ్చే తరంగాల వల్ల మెదడులోని కుడివైపు ఉండే సున్నిత ప్రాంతం తొందరగా దెబ్బతింటుంది. అందుకే సెల్‌ఫోన్‌ను ఎడమ చెవి పక్కన ఉంచి మాట్లాడాలని, సెల్‌ఫోన్ ఎంత చిన్నగా ఉంటే తరంగాల దుష్ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం తింటూ ఫోన్‌లో మాట్లాడడం వల్ల కూడా విపరిణామాలు చోటుచేసుకుంటాయి. నిద్ర పోవడానికి కనీసం రెండు గంటల ముందే సెల్‌ఫోన్‌లో వేరే గదిలో ఉంచడం మంచిది. పిల్లలను రోజులో గంటకు మించి సెల్‌ఫోన్, కంప్యూటర్‌లను వాడకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.