యువ

జీతం బాగుంటే కొత్త కొలువుకు రెడీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం సంపాదన బాగానే ఉన్నా, కడుపులో చల్ల కదలకుండా హాయిగా కాలం దొర్లిపోతున్నా- ఏ మాత్రం జంకులేకుండా- చేస్తున్న ఉద్యోగానికి ‘గుడ్ బై’ చెప్పేందుకు నేటి యువత వెనుకాడడం లేదు. మంచి జీతం ఇస్తామంటే చాలు కొత్త ఉద్యోగానికి సుముఖత చూపే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ‘ఇన్‌సైడ్ ద మైండ్ ఆఫ్ టుడేస్ క్యాండిడేట్స్’ పేరిట ‘లింక్డ్‌ఇన్’ సంస్థ చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన యువతీ యువకులు పాత ఉద్యోగాలకు స్వస్తివాక్యం పలికి కొత్త కొలువుకు సిద్ధమంటున్నారు. ప్రస్తుత సంపాదన కంటే జీతభత్యాలు ఎక్కువైతే చాలు కొత్త ఉద్యోగం పట్ల ఉత్సాహం చూపేవారి సంఖ్య భారీగానే ఉంటోందట!
దేశవ్యాప్తంగా ‘లింక్డ్‌ఇన్’ జరిపిన సర్వేలో సుమారు 540 మంది యువతీ యువకులు పాల్గొని తమ మనోభావాలను నిర్మొహమాటంగా ప్రకటించారు. కొత్త ఉద్యోగంలో ఆర్థిక ప్రోత్సాహకాలు, ఇతర ప్రయోజనాలు ఎలా ఉంటాయోనన్న విషయమై 52 శాతం మంది ఆసక్తి చూపారు. ఉద్యోగం మారడానికి అధిక జీతభత్యాలు తప్ప మరే ఇతర కారణాలు లేవని ఎక్కువ మంది భావిస్తున్నారు. వృత్తి నైపుణ్యాలు పెంచుకునేందుకు కూడా కొత్త ఉద్యోగం అవసరమని అనేకమంది సర్వే సందర్భంగా తెలిపారు. వ్యక్తిగతంగాను, వృత్తిపరంగానూ మరిన్ని ప్రయోజనాలుంటే పాత ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని 55 శాతం మంది తేల్చి చెప్పారు. కొత్త ఉద్యోగాన్ని అనే్వషించే సమయంలో సంబంధిత కంపెనీల వెబ్‌సైట్లలో అన్ని వివరాలను పరిశీలిస్తామని 49 శాతం మంది తెలిపారు. ఇందుకు సెర్చ్ ఇంజన్లను వాడతామని 47 శాతం మంది, ఆ సంస్థ ఉద్యోగుల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటామని 35 శాతం మంది వివరించారు. కొత్త ఉద్యోగంలో వృత్తిపరమైన నైపుణ్యం గురించి మాత్రమే ఆసక్తి చూపుతామని సర్వేలో 91 శాతం మంది తమ మనోభావాలను ఆవిష్కరించారు. ఇంటర్వ్యూ సమయంలోనే జీతభత్యాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని 37 శాతం మంది తెలిపారు. పాత ఉద్యోగం వీడేందుకు మంచి జీతభత్యాలే ఏకైక కారణం గనుక కొత్త కంపెనీలో ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల స్థితిగతుల గురించి ఆరా తీసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఉద్యోగ భద్రతకు కూడా ప్రాధాన్యం ఇస్తామని, ఇందుకు సోషల్ మీడియాలో సమాచారం ఉపయోగంగా ఉంటుందని 63 శాతం మంది చెప్పారు. కొత్త ఉద్యోగం చేసే చోట అక్కడి పరిస్థితులను, యాజమాన్యం పద్ధతులను కూడా అవగాహన చేసుకుంటామని 54 శాతం మంది తెలిపారు. యాజమాన్య ప్రతినిధులతో అన్ని వివరాలనూ ముందుగానే మాట్లాడుకుంటే కొత్త ఉద్యోగంలో చేరేందుకు ఆశాజనకమైన వాతావరణం ఏర్పడుతుందని 45 శాతం మంది తెలిపారు. నూతన ఉద్యోగం పట్ల, సంబంధిత యాజమాన్యం పట్ల మానసికంగా సానుకూల వైఖరి అవసరం అని ఎక్కువ శాతం మంది యువతీ యువకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం పనిచేసే చోట వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచుకునే అవకాశం ఉన్నపుడు కొత్త ఉద్యోగం ఎందుకని కొందరు సర్వే సందర్భంగా ప్రశ్నించారు. ఆర్థిక భద్రత ఉంటే మరో ఉద్యోగంలో చేరడం అంటే సవాళ్లను ఎదుర్కొనడమేనని మరికొందరు అభిప్రాయ పడ్డారు. వృత్తిపరమైన, వ్యక్తిగతమైన జీవనానికి ఇబ్బందులు ఎదురైతే ఉద్యోగం మారాల్సిందేనని, అయితే చేరబోయే సంస్థల్లో జీతభత్యాలు మరింత మెరుగ్గా ఉంటేనే ఇది సాధ్యమని వారు అంటున్నారు. ఏదిఏమైనా ఎక్కువ సంపాదన ఉంటే- కొత్త ఉద్యోగంలో చేరడం తప్పేమీ కాదన్న వారి సంఖ్య అధికంగా ఉందని సర్వేలో స్పష్టమైంది.