యువ

అది ఇది ఏమని.. అన్ని రంగముల..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబ్బాయిలకు ఏ విషయంలోనూ తీసిపోమని ఇప్పటికే నిరూపిస్తున్న అమ్మాయిలకు- కొన్ని ప్రత్యేకమైన సాంకేతిక కోర్సుల్లోను, సైనిక పాఠశాలల్లోను ఇకపై అవకాశాలు దక్కనున్నాయి. ఇప్పటి వరకూ అమ్మాయిలకు అడ్మిషన్ లేని భిన్నమైన కోర్సులలో, విద్యాసంస్థల్లో వారికి అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంతవరకూ మైనింగ్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, మైనింగ్ మిషనరీ ఇంజనీరింగ్ వంటి సాంకేతిక కోర్సుల్లో అమ్మాయిలకు భాగస్వామ్యం లేదు. ఆర్మీ, నేవీ, వైమానిక దళాల్లో ఇటీవల మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ కొన్ని కోర్సుల్లో వారికి అవకాశాలు దక్కడం లేదు. దేశంలోనే ప్రఖ్యాతి పొందిన ఐఐటిల్లో అమ్మాయిలకు ముఖ్యంగా గ్రామీణ పేదవర్గాల బాలికలకు ప్రవేశం కల్పించాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయించింది. ఐఐటిల్లో అమ్మాయిలు సీట్లు సాధించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. ఏ రంగంలోనైనా మహిళలు సత్తా చాటగలరని నిరూపించేందుకు కొన్ని ప్రత్యేకమైన కోర్సుల్లో, విద్యాసంస్థల్లో అమ్మాయిల ప్రవేశాలకు ఉన్న అడ్డంకులను కేంద్ర ప్రభుత్వం తొలగించింది.
ఐఐటిల్లో సీట్ల భర్తీకి సంబంధించి 2015-16 విద్యా సంవత్సరం వరకూ ఉన్న నిబంధనలను గత ఏడాది తొలగించారు. ఐఐటిల్లో అడ్మిషన్లు పొందుతున్న బాలికల శాతం కేవలం 8 నుంచి 14 మాత్రమే. ఇకపై అన్ని ఐఐటిల్లో 20 శాతం సీట్లను అమ్మాయిలకు కేటాయించాలని, అవసరమైతే ప్రవేశ పరీక్షకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఐఐటి పాలకమండళ్లను ఇప్పటికే ఆదేశించింది. దీంతో ఐఐటిల్లో బాలికల సంఖ్యను పెంచేందుకు వారికి ఇరవై శాతం సీట్లను కేటాయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, కొన్ని ప్రత్యేకమైన కోర్సుల్లో అమ్మాయిల అడ్మిషన్లకు సంబంధించి అమలులో ఉన్న నిబంధనలు తొలగించారు. దీంతో ధన్‌బాద్, ఖరగ్‌పూర్, బిహెచ్‌యూ ఐఐటిల్లో 347 మైనింగ్ ఇంజనీరింగ్ సీట్లలో చేరేందుకు అమ్మాయిలకు అవకాశం లభించింది. అలాగే, సైనిక పాఠశాలల్లో బాలికలకు సీట్లు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 26 సైనిక పాఠశాలలున్నాయి. ఇప్పటి వరకూ ఈ పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం లేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో కోరుకొండ, కలికిరిలలో సైనిక పాఠశాలలున్నాయి. తెలంగాణకు సంబంధించి వరంగల్ జిల్లాలో సైనిక పాఠశాల ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశంలోని అన్ని సైనిక పాఠశాలల్లో విద్యార్థినులకు ప్రవేశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చింది. సైనిక పాఠశాలల్లో చదువు పూర్తి చేసే అమ్మాయిలు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై రక్షణ శాఖలో ఉద్యోగాలు పొందవచ్చు. విద్య, ఉద్యోగ రంగాల్లో మహిళలకు ప్రస్తుతం 33 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. అయితే, ఈ నిబంధన ఐఐటిలు, ఐఐఎంలు వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థలకు వర్తించడం లేదు. ఎవరైనా ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగానే సీట్లు దక్కించుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఐఐటిలు, ఐఐఎంలలో అనుకున్నంత సంఖ్యలో బాలికలు చేరడం లేదు. దీంతో వీరికి సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐఐఎంలలో మాత్రం 25 శాతం మేరకు యువతులు అడ్మిషన్లు పొందుతున్నా ఐఐటిల్లో ఈ పరిస్థితి కనిపించడం లేదు. కేవలం అహ్మదాబాద్‌లోని ఐఐఎంలో మాత్రం అడ్మిషన్లు పొందే అమ్మాయిల శాతం గత ఏడాది 38గా నమోదైంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా సాంకేతిక విద్య, రక్షణ రంగంలో మహిళలు సత్తా నిరూపించుకునేందుకు అవకాశాలు మెరుగయ్యాయి.