యువ

ఉదయ్‌పూర్ కుర్రాడు అదరగొట్టాడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఐఐటి-జీ’ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్)లో నూటికి నూరు శాతం మార్కులు సాధించి ఆ కుర్రాడు అరుదైన ఘనతను సాధించాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన కల్పిత్ వీర్‌వాల్ ఇటీవల జరిగిన ‘ఐఐటి-జీ’ ప్రధాన పరీక్షలో 360 మార్కులకు 360 మార్కులు సాధించాడు. ఈ ఘనత ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు’లో నమోదైంది. ఐఐటి-జీ ప్రధాన పరీక్షలో నూరు శాతం మార్కులు సాధించిన తొలి వ్యక్తిగా కల్పిత్ చరిత్ర సృష్టించాడు. ముంబయి ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరిన ఈ కుర్రాడిని ‘విద్యారంగం- సాధకుల’ విభాగంలో అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తించినట్లు ‘లిమ్కా బుక్’ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. 2018 సంవత్సరానికి సంబంధించి విడుదలయ్యే ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు’లో కల్పిత్ ఘనత నమోదైంది.
‘ఐఐటి-జీ’ ప్రవేశపరీక్షలో సత్తా చూపగలనన్న ఆత్మవిశ్వాసం తనకు ఉందని, అయితే నూరుశాతం మార్కులను సాధిస్తానని మాత్రం అనుకోలేదని కల్పిత్ చెబుతున్నాడు. ‘లిమ్కా బుక్’లో స్థానం సంపాదిస్తానని కూడా ఎప్పుడూ ఊహించలేదంటున్నాడు. తన సొంత రాష్టమ్రైన రాజస్థాన్‌లో ఐఐటి ప్రవేశపరీక్షకు అత్యధిక సంఖ్యలో కోచింగ్ కేంద్రాలున్న ‘కోట’ పట్టణం గురించి చాలాకాలం క్రితమే విన్నానని తెలిపాడు. ‘కోట’ పట్టణంలో కోచింగ్ తీసుకునే వారిలో ఎక్కువమంది ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్లను పొందుతున్నారని, ఆ ప్రభావం తనపై ఉందని కల్పిత్ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. ‘కోట’లో శిక్షణ పొందకపోయినప్పటికీ తాను ప్రణాళిక ప్రకారం చదివి ‘ఐఐటి-జీ’లో శతశాతం మార్కులు సాధించానని తెలిపాడు. రోజుకు పది, పదిహేను గంటల సేపు పుస్తకాలకు అతుక్కుపోవడం తనకు అలవాటు లేదని, ఏకాగ్రతతో చదవడంతో తాను ఇంతటి ఘనతను సాధించగలిగానని అంటున్నాడు.