యువ

‘కిల్లర్ గేమ్’నుంచి రక్షణ ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీనేజీ యువత ప్రాణాలు తీస్తున్న ఆట ‘బ్లూవేల్ చాలెంజ్’. ఈ ఆట మాయలో పడి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలామంది యువతీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలోనూ ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ‘బ్లూవేల్’ ఆట చాలా కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. తమ పిల్లలను బ్లూవేల్ నుంచి కాపాడుకోవాలంటే వారిపై తల్లిదండ్రులు ఓ కనే్నసి ఉంచాలన్నది నిపుణుల సూచన. ప్రపంచంలో ఇప్పటికే ఈ ఆటబారిన పడి అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 150. 50 రోజుల ఆటలో మొదట మ్యూజిక్ వినడం, తరువాత ప్రాణాపాయ ఛాలెంజ్‌లతో కొనసాగుతుంది. చివరకు ఆత్మహత్యకు ఈ ఆట పురిగొల్పుతుంది. ఈ ఆటలో ప్రతి టాస్క్‌కు ఫొటోలతో రుజువులు సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా యువత ఈ ఆటకు ఆకర్షితులై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే కుర్రకారును దారిలో పెట్టవచ్చని, బ్లూవేల్ నుంచి రక్షించడం సులువేనని ప్రసార మాధ్యమాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని సైకియాట్రిస్ట్ డాక్టర్ హరీష్ సెట్టి, డాక్టర్ అచల్ భగత్, అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రి ఇంద్రప్రస్త స్పందించారు.
పిల్లల మానసిక ప్రవర్తనను గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఎంతైనా ఉందని వారు అంటున్నారు. ఈ ఆటకు ఆకర్షితులైనవారి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు రావచ్చో వారు సూచిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తే వారి గురించి జాగ్రత్తపడాలో వారు సూచించారు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు, వారి ఉపాధ్యాయులు ఈ అంశాలపై దృష్టి సారించాలని చెబుతున్నారు. పిల్లలు ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎక్కువసేపు గడుపుతున్నా, సెల్‌ఫోన్లు, ఇతర గాడ్జెట్ల కోసం వెంపర్లాడుతున్నా సందేహించాల్సిందే. వారేం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టి వారికి అర్థమయ్యేలా విషయాలు చెప్పాలి.ఈ ఆటలో లక్ష్యాలు లేదా టాస్క్‌లు అన్నీ తెల్లవారుజామునే ఉంటున్నాయి. ముఖ్యంగా 4 గంటల సమయంలో. ఆ ఆటలో పిల్లలు నిమగ్నమైతే ఉదయం నిద్రలో జోగుతుంటారు. అలా చేస్తున్నట్లయితే వారు రాత్రిపూట ఏం చేస్తున్నారో గమనించాల్సిందే. రాత్రిపూట తాము ఉండే గదులను తెరవకుండా, ఎవరూ రాకుండా తాళాలు వేయడం, మూసి ఉంచడం చేస్తున్నట్లయితే ఆ పిల్లలపై దృష్టిపెట్టాలి. వారి చేతులు, శరీర భాగాల్లో గతంలో లేని గుర్తులు, టాటూలు కనిపిస్తే ఆరా తీయాలి. ఎప్పుడూ లేనివిధంగా హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలను పిల్లలు చూస్తున్నా, వాటిని చూడాలని తహతహలాడుతున్నా జాగ్రత్తపడాలి. సామాజిక మాధ్యమాల్లో వారు విభ్రాంతికర, పిచ్చిపిచ్చి అంశాలను పోస్ట్ చేస్తున్నట్లయినా అనుమానమే.
మేడమీద ఒంటరిగా గడపుతున్నా, వివిధ కారణాలవల్ల ఆత్మహత్యలు చేసుకున్నవారిపట్ల ఏ సంబంధం లేకపోయినా సానుభూతి వ్యక్తం చేస్తున్నా ఆ కుర్రకారు తీరు అనుమానించదగినదే.
స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఉన్నట్టుండి దూరంగా ఉన్నట్లు, బాంధవ్యాన్ని దూరం చేసుకుంటున్న తీరుతో వ్యవహరించినా అప్రమత్తమవ్వాలి. చిన్నచిన్న అంశాలకే ఉన్నట్లుండి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నా, చిర్రుబుర్రులాడుతున్నా, గతంలో తను ఆనందం కోసం ఇష్టంగా చేసే పనులపట్ల ఇప్పుడు, ఉన్నట్లుండి ఆసక్తి చూపకపోయినా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి.
పిల్లలు వాడే గాడ్జెట్లు, ఫోన్లతో తల్లిదండ్రుల ఫోన్లు సింక్ అయ్యేలా సరికొత్త ‘యాప్’ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. పిల్లల మొబైల్ ఫోన్ల యాక్టివిటీని నిశితంగా గమిస్తూండాలి. వారిలో వచ్చే అనూహ్య, ఆకస్మిక మార్పులను గమనించి వారిని దారిలోకి తీసుకువస్తే కిల్లర్ గేమ్ ‘బ్లూవేల్’ గండం తప్పుతుంది.